Parliament Monsoon session | 88 రోజులైనా ముగియని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. 18 ఏళ్ల రికార్డ్ బ్రేక్
Parliament Monsoon session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon session) ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడి నేటికి 88 రోజులైంది. ఈ సందర్భంగా దేశ పార్లమెంటరీ చరిత్రలో 18 ఏళ్ల నాటి పాత రికార్డు బద్దలైంది. నిరవధిక వాయిదాకు, ప్రొరోగ్ కావడానికి మధ్య ఉన్న గ్యాప్ ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. 2008 నాటి 87 రోజుల పాత రికార్డు బద్దలైంది.
Parliament Monsoon session | త్రినేత్ర న్యూస్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon session) ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, సమావేశాలు వాయిదా పడి నేటితో 88వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ అధికారికంగా ముగిసినట్లు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి ఇంకా ప్రకటన (Prorogation) రాలేదు. దీంతో సమావేశాలు ఇంకా అధికారికంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా దేశ పార్లమెంటరీ చరిత్రలో 18 ఏళ్ల నాటి పాత రికార్డు బద్దలైంది. నిరవధిక వాయిదాకు, ప్రొరోగ్ కావడానికి మధ్య ఉన్న గ్యాప్ ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. 2008 నాటి 87 రోజుల పాత రికార్డు బద్దలైంది.
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు మార్గం సుగమం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన సమావేశాల సమయంలో వీగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులను ఎలాగైనా ఆమోదింపజేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు లేదా డీలిమిటేషన్ (Delimitation) వంటి కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం పార్లమెంట్‌ను ప్రొరోగ్ చేయకుండా జాప్యం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం తక్కువ వ్యవధిలోనే మళ్లీ సమావేశమయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిబంధనలు ఏం చెబుతున్నాయ్..?
కొత్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 14 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అదే ప్రస్తుతం ఉన్న సమావేశాల కాలంలోనే పొడిగించిన లేదా ప్రత్యేక సిట్టింగ్‌ను నిర్వహించాలంటే కేవలం రెండు రోజుల ముందు నోటీసు ఇస్తే సరిపోతుంది. ఈ కారణంగానే పార్లమెంట్‌ను మళ్లీ సమావేశపరిచేందుకు కేంద్రం ప్రొరోగ్ చేయకుండా కేవలం స్పీకర్ ద్వారా అనిశ్చిత కాల వాయిదా (Adjourned Sine Die) వేయించింది.
రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనా లేదు
ఉభయసభలను ప్రొరోగ్ చేయడానికి రాజ్యాంగంలో ఎలాంటి నిర్దిష్ట గడువు లేదు. ఏదైనా సభను (లోక్‌సభ లేదా రాజ్యసభ) నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత ఎంత కాలంలోపు దానికి అధికారికంగా ముగింపు (ప్రోరోగ్) ప్రకటించాలనే విషయాన్ని రాజ్యాంగంలో పేర్కొనలేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 85(2)(a) ప్రకారం పార్లమెంటు ఉభయ సభలను లేదా ఏదైనా ఒక సభను ప్రొరోగ్ చేసే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. కేంద్ర కేబినెట్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ప్రొరోగ్ ఉత్తర్వులు జారీ చేస్తారు. కాబట్టి ప్రొరోగ్ జాప్యం నిబంధనల ఉల్లంఘన కిందకు రాదు.
గత రికార్డులు..
గతంలోనూ చాలా సందర్భాల్లో సమావేశాలు ప్రొరోగ్ కాకుండా సుదీర్ఘంగా కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. 1963లో తొలిసారి పార్లమెంట్ ఉభయసభలు అధికారికంగా ముగియకుండా 41 రోజులు కొనసాగాయి. ఆ తర్వాత 1987లో 76 రోజులు, 1989లో 54 రోజులు, 2006, 2013లో 49 రోజులు కొనసాగాయి. ఇక 2008లో అత్యధికంగా 87 రోజులపాటూ అధికారికంగా ముగియలేదు. 2008లో భారత్-అమెరికా అణు ఒప్పందానికి నిరసనగా లెఫ్ట్ పార్టీలు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాయి.
దీంతో ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవడానికి జూలై 21, 22 తేదీల్లో లోక్‌సభ ప్రత్యేకంగా సమావేశమైంది. జూలై 22న జరిగిన చారిత్రాత్మక విశ్వాస పరీక్షలో యూపీఏ ప్రభుత్వం విజయం సాధించింది. ఆ తర్వాత కూడా ఆ సెషన్ అలాగే కొనసాగింది. అక్టోబర్ 17న సభ మళ్లీ సమావేశమైంది. అనంతరం అక్టోబర్ 24న వాయిదా పడి డిసెంబర్ 10న మరోసారి సమావేశమైంది. అలా ప్రోరోగ్ కాకుండా ఆ పార్లమెంట్ సమావేశాలు 87 రోజులు కొనసాగాయి. ఆ రికార్డును 2026 పార్లమెంట్ వర్షాకాల సమావేశం బద్దలు కొట్టింది.
Also Read..
ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లి.. జైలుపాలయ్యాడు..
ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు.. ట్రంప్ కీలక ప్రకటన..
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై విచారణ.. చైనా గూఢచర్య ఆరోపణల కలకలం..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Russia | ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లి.. జైలుపాలయ్యాడు..
- ●Donald Trump | ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు.. ట్రంప్ కీలక ప్రకటన..
- ●Nvidia | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై విచారణ.. చైనా గూఢచర్య ఆరోపణల కలకలం..
- ●Madhya Pradesh | Massive Fire | మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు సజీవ దహనం
- ●Delhi Air Quality | దీపావళి ఎఫెక్ట్.. పటాకుల మోతతో కాలుష్య కోరల్లో ఢిల్లీ
- ●Stock Markets | భారీ లాభాల తర్వాత మార్కెట్లకు బ్రేక్.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..

Russia | ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లి.. జైలుపాలయ్యాడు..

Donald Trump | ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు.. ట్రంప్ కీలక ప్రకటన..

Nvidia | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై విచారణ.. చైనా గూఢచర్య ఆరోపణల కలకలం..

Madhya Pradesh | Massive Fire | మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు సజీవ దహనం






