Abhishek Banerjee | అలా అయితే.. టీఎంసీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించండి : అభిషేక్ బెనర్జీ డిమాండ్
Abhishek Banerjee | పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ చట్టబద్ధతను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఎత్తిచూపింది. గత TMC ప్రభుత్వాన్ని పునరుద్ధరించి ఆరు నెలల్లోగా తాజా ఎన్నికలు నిర్వహించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
Abhishek Banerjee | త్రినేత్ర న్యూస్ : తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ఎన్నికల చట్టబద్ధతను తీవ్రంగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని గతంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని, ఆరు నెలల్లోగా తాజా ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటర్ల వివరాల పరిశీలన కోసం ఎన్నికల సంఘం ఉపయోగించిన లాజికల్ డిస్క్రిపెన్సీ కేటగిరీపై తాము ఇంకా ఎలాంటి తీర్పు ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తారుమారు చేసిన ఓట్ల తీర్పు ద్వారా పూర్తి స్థాయి ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది..? అంటూ ప్రశ్నించారు. ఆ లెక్కన చూస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కేవలం మధ్యంతర (Interim) ప్రభుత్వంలానే పరిగణించాలని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పాత ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని, అర్హులైన ప్రతి ఓటరుకు తిరిగి ఓటు హక్కు కల్పించి ఆరు నెలల్లో కొత్తగా ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో జరుగుతున్న సర్ ప్రక్రియలో ఓటర్లకు జారీ చేసిన నోటీసుల్లో పారదర్శకత కొరవడిందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల వివరాల పరిశీలన కోసం ప్రవేశపెట్టిన లాజికల్ డిస్క్రిపెన్సీ (Logical Discrepancy) విధానాన్ని పశ్చిమ బెంగాల్‌లో కేవలం ఒక మధ్యంతర ఏర్పాట్లు (Interim Arrangement) గానే అనుమతించామని, దీని చట్టబద్ధతపై తాము ఇంకా తుది తీర్పు ఇవ్వలేదని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బీహార్‌లో సర్ విషయంలో తీసుకున్న నిర్ణయం.. ఈ ప్రక్రియ నుంచి తలెత్తే ప్రతి అంశానికి సబంధించిన తుది నిర్ణయం కాదని పేర్కొంది.
Also Read..
వారణాసి నుంచి నాగ్‌పూర్ వరకూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. విమానయాన రంగానికి రూ.38 వేల కోట్ల నష్టాలు..
ఇక పెన్షనర్లకు.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇంట్లో నుంచే సులభంగా..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

DPDP Act | పత్రికా స్వేచ్ఛకు ముప్పేమీ లేదు.. డీపీడీపీ చట్టంపై అశ్విని వైష్ణవ్ కామెంట్స్
అక్టోబర్ 28, 2026

Supreme Court | సైబర్ నేరగాళ్లను కఠినంగా శిక్షించాల్సిందే.. డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అక్టోబర్ 28, 2026

Supreme Court | సర్క్యులర్లు జారీ చేస్తే సరిపోదు.. యాసిడ్ దాడుల నివారణకు బాధ్యత తీసుకోవాలి
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●Graduate MLC Elections | పట్టభద్రుల MLC పోరు: కాంగ్రెస్ మార్క్ వ్యూహం.. ఏకంగా 233 మంది ఇన్ఛార్జుల రంగప్రవేశం!
- ●South Central Railway | ఇక పెన్షనర్లకు.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇంట్లో నుంచే సులభంగా..
- ●Jairam Ramesh | వారణాసి నుంచి నాగ్‌పూర్ వరకూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు
- ●Kotta Prabhakar Reddy | లాస్య మృతిలో వాస్తవాలు తేల్చాలి.. 20 లక్షల పరిహారం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్
- ●Janhvi Kapoor | ఆ అవమానం జీవితాంతం మోయాల్సిందే - పెద్ద వివాదంపై జాన్వీకపూర్ రియాక్షన్
- ●Indian Aviation Industry | ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. విమానయాన రంగానికి రూ.38 వేల కోట్ల నష్టాలు..

Graduate MLC Elections | పట్టభద్రుల MLC పోరు: కాంగ్రెస్ మార్క్ వ్యూహం.. ఏకంగా 233 మంది ఇన్ఛార్జుల రంగప్రవేశం!

South Central Railway | ఇక పెన్షనర్లకు.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇంట్లో నుంచే సులభంగా..

Jairam Ramesh | వారణాసి నుంచి నాగ్‌పూర్ వరకూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు

Kotta Prabhakar Reddy | లాస్య మృతిలో వాస్తవాలు తేల్చాలి.. 20 లక్షల పరిహారం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్



