త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

car catches fire | మంట‌ల్లో కారు.. చిన్నారి స‌హా ఆరుగురు స‌జీవ‌ద‌హ‌నం

car catches fire | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ (Uttar Pradesh) ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ (Muzaffarnagar)లో అతివేగంగా ప్ర‌యాణిస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్ట‌డంతో మంట‌లు చెల‌రేగి (car catches fire) చిన్నారి స‌హా ఆరుగురు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు (six people burnt alive).

D

National | Published On Nov 9, 2026, 11.39 am IST

car catches fire | మంట‌ల్లో కారు.. చిన్నారి స‌హా ఆరుగురు స‌జీవ‌ద‌హ‌నం
Advertisement

car catches fire | త్రినేత్ర న్యూస్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ (Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ (Muzaffarnagar) జిల్లాలో అతివేగంగా ప్ర‌యాణిస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది (speeding car crashed into an electric pole). దీంతో కారుకు మంట‌లు (car catches fire) అంటుకుని చిన్నారి స‌హా ఆరుగురు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు (six people burnt alive). జిల్లాలోని పానిపట్-ఖతిమా జాతీయ రహదారి జగహేరి సమీపంలో సోమ‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మృతులు హ‌ర్యానాలోని హిస‌ర్ నుంచి హ‌రిద్వారాకు వెళ్తున్నారు. మార్గం మ‌ధ్య‌లో వీరు ప్ర‌యాణిస్తున్న కారు అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ వెంట‌నే కారులో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. త‌ప్పించుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో కారులోని వారంతా మంట‌ల్లో స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read..

88 రోజులైనా ముగియని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. 18 ఏళ్ల రికార్డ్ బ్రేక్

ఉద్యోగం కోసం ర‌ష్యాకు వెళ్లి.. జైలుపాల‌య్యాడు..

ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు.. ట్రంప్ కీలక ప్రకటన..

Advertisement
Advertisement