Bhogi Movie | మరోసారి శర్వానంద్ `భోగి` విడుదల వాయిదా.. కారణం ఏంటంటే?
Bhogi Movie | తెలంగాణ నేపథ్యంలో యువ హీరో శర్వానంద్ (Sharwanand) కథనాయుడిగా తెరకెక్కుతున్న `భోగి` సినిమా (Bhogi Movie) విడుదల వాయిదా పడింది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీని.. CBFC రివైజింగ్ కమిటీ రివ్యూ కోసం పంపించడంతో వాయిదా తప్పలేదు.
Bhogi Movie | త్రినేత్ర న్యూస్: తెలంగాణ నేపథ్యంలో యువ హీరో శర్వానంద్ (Sharwanand) కథనాయుడిగా తెరకెక్కుతున్న `భోగి` సినిమా (Bhogi Movie) విడుదల వాయిదా పడింది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీని.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రివైజింగ్ కమిటీ రివ్యూ కోసం పంపించడంతో వాయిదా తప్పలేదు. సర్టిఫికెట్‌పై కమిటీ తుది నిర్ణయం వచ్చిన తర్వాత విడుదలకు సంబంధించిన కొత్త తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించనుంది. మాస్ డైరెక్టర్ సంపత్ నది (Sampath Nandi) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామాలో అనుపమ పరమేశ్వరన్, డింపల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, దీపావళి సందర్భంగా నవంబర్ 8న జరగాల్సిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక, ట్రైలర్ లాంచ్ కూడా సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డాయి.
కాగా, భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని వాస్తవానికి ఆగస్టు 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వీఎఫ్ఎక్స్ (VFX) పనులకు మరింత సమయం పడుతుండటంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. సినిమాలోని విజువల్ స్కేల్, పీరియడ్ వరల్డ్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లను ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమంగా తీర్చిదిద్దే ఉద్దేశంతోనే ఈ వాయిదా వేసినట్లు వెల్లడించారు.
1960ల నాటి ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ బలమైన కథ సాగనుండగా, ఇందులో శర్వానంద్ ‘గంగా’ అనే అత్యంత ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ కోసం చిత్రబృందం ఏకంగా 30 రోజుల పాటు సాగిన భారీ యాక్షన్ షెడ్యూల్‌ను ఇటీవల విజయవంతంగా పూర్తి చేసింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nvidia | జెన్సన్ హువాంగ్ వివాదం.. ఎన్విడియా షేర్లు పతనమవుతాయా?
- ●Chhattisgarh | త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశ.. సోషల్ మీడియా చూసి మేనల్లుడిని చంపి కిడ్నీలు, ఊపిరితిత్తులు తొలగించిన నిందితుడు
- ●car catches fire | మంటల్లో కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
- ●KTR | ప్రజలు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణా?.. దీనిని తుగ్లక్ పాలన కాకపోతే ఇంకేమి అనాలి?: కేటీఆర్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. పెట్టుబడిదారుల్లో జోష్..
- ●Parliament Monsoon session | 88 రోజులైనా ముగియని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. 18 ఏళ్ల రికార్డ్ బ్రేక్

Nvidia | జెన్సన్ హువాంగ్ వివాదం.. ఎన్విడియా షేర్లు పతనమవుతాయా?

Chhattisgarh | త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశ.. సోషల్ మీడియా చూసి మేనల్లుడిని చంపి కిడ్నీలు, ఊపిరితిత్తులు తొలగించిన నిందితుడు

car catches fire | మంటల్లో కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం

KTR | ప్రజలు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణా?.. దీనిని తుగ్లక్ పాలన కాకపోతే ఇంకేమి అనాలి?: కేటీఆర్






