Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
Road Accident | పంజాబ్ (Punjab)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మంది గాయపడ్డారు.
Road Accident | పంజాబ్ (Punjab)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. పికప్ ట్రక్కు - కంటైనర్ వాహనం రెండూ ఢీ కొన్నాయి (Truck-Jeep collision). ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఫిరోజ్‌పూర్ (Ferozpur) జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జలాలాబాద్‌కు చెందిన సుమారు 28 మంది బంధువులు తమ కుటుంబంలోని ఓ వృద్ధురాలి అస్థికలను గంగలో కలిపేందుకు అమృత్‌సర్‌లోని డేరా బియాస్‌కు వెళ్లారు. ఆ కార్యక్రమం ముగించుకొని పికప్ ట్రక్కులో ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా రోడ్డు (Ferozepur-Fazilka road)పై వీరు ప్రయాణిస్తున్న వాహనం కంటైనర్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
ఈ ప్రభుత్వానికి ఇంకెంతకాలం భయపడాలి..?.. కాక్రోచ్ పార్టీ
జూలై 31లోపు ఐటీఆర్ ను ఫైల్ చేయకపోతే నష్టమే.. ఈ 6 ప్రయోజనాలను కోల్పోతారు..
ఈ నెల 12 దాకా వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం..!
తాజావార్తలు
- ●WhatsApp | వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. స్కామ్‌లను పసిగడుతుంది..
- ●WhatsApp Status Edit | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై పోస్ట్ చేసిన 'స్టేటస్'ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!
- ●Phone Tapping Case | అధికార దుర్వినియోగంలో కేసీఆర్‌ని మించిన వారు లేరు : ఎంపీ చామల
- ●RTC Union Elections | జులైలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు..!
- ●Jagga Reddy | సైకిళ్లిచ్చారు.. చిన్నారుల్లో ఉత్సాహం నింపారు
- ●Su-57 Fighter Jet India | శత్రువుల గుండెల్లో వణుకు.. భారత్‌కు రష్యా 'Su-57' ఫైటర్ జెట్ల ఆఫర్, దీని స్పెషాలిటీ ఏంటంటే?

WhatsApp | వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. స్కామ్‌లను పసిగడుతుంది..

WhatsApp Status Edit | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై పోస్ట్ చేసిన 'స్టేటస్'ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!

Phone Tapping Case | అధికార దుర్వినియోగంలో కేసీఆర్‌ని మించిన వారు లేరు : ఎంపీ చామల

RTC Union Elections | జులైలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు..!






