త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | ఈ నెల 12 దాకా వ‌ర్షాలు.. హెచ్చ‌రిక‌లు జారీ చేసిన హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం..!

TG Weather | తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎండ‌లు క్ర‌మంగా త‌గ్గుతాయ‌ని పేర్కొంది. ఈ నెల 12 వ‌ర‌కు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. శ‌నివారం నుంచి ఈ నెల 12 వ‌ర‌కు తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

P

Telangana | Published On Jun 6, 2026, 4.13 pm IST

TG Weather | ఈ నెల 12 దాకా వ‌ర్షాలు.. హెచ్చ‌రిక‌లు జారీ చేసిన హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం..!
Advertisement

TG Weather | తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎండ‌లు క్ర‌మంగా త‌గ్గుతాయ‌ని పేర్కొంది. ఈ నెల 12 వ‌ర‌కు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. శ‌నివారం నుంచి ఈ నెల 12 వ‌ర‌కు తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జగిత్యాల, నిర్మల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచ‌నా వేసింది.

అలాగే, ఆదివారం నుంచి మంగ‌ళ‌వారం వ‌ర‌కు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. అలాగే, బుధ‌వారం నిర్మ‌ల్, నిజామాబాద్‌, రాజ‌న్న సిరిసిల్ల‌, జ‌గిత్యాల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. ఇదిలా ఉండ‌గా.. ఈ నెల 8 నుంచి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని తెలిపింది. ఈ నెల 9, 10 తేదీల నాటికి పలు ప్రాంతాల్లో 36 డిగ్రీల కంటే దిగువకు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.

వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు స్థానిక వాతావరణ హెచ్చరికలను అనుసరించాలని వాతావరణ శాఖ సూచించింది. మ‌రో వైపు నైరుతి రుతుప‌వ‌నాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు- మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగ‌తా ప్రాంతాల్లోకి విస్త‌రించేందుకు ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. తూర్పు మ‌ధ్‌య‌ప్ర‌దేశ్‌, దాన్ని ఆనుకొని ఉన్న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌పై ఉన్న ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం విద‌ర్భ‌, తెలంగాణ‌, రాయ‌ల‌సీమ మీదుగా ఈశాన్య త‌మిళ‌నాడు వ‌ర‌కు స‌గ‌టు స‌ముద్ర‌మ‌ట్టానికి 0.9 కిలోమీట‌ర్ల ఎత్తులో ద్రోణి విస్త‌రించి ఉంద‌ని వివ‌రించింది.

Advertisement
Advertisement