Jagga Reddy | సైకిళ్లిచ్చారు.. చిన్నారుల్లో ఉత్సాహం నింపారు
Jagga Reddy | చిన్నారుల్లో ఉత్సాహం, ఆరోగ్యం, చదువు పట్ల ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముందుకెళ్తున్నారు. ఐదేళ్ల నుంచి 15 ఏండ్ల మధ్య ఉన్న పిల్లలకు సైకిళ్లు అందించి వారిలో ఉత్సాహం నింపారు.
- సంగారెడ్డిలో 210 మంది చిన్నారులకు అందజేసిన జగ్గారెడ్డి
Jagga Reddy | త్రినేత్ర.న్యూస్: చిన్నారుల్లో ఉత్సాహం, ఆరోగ్యం, చదువు పట్ల ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముందుకెళ్తున్నారు. ఇప్పటికే 400 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేయగా శనివారం సంగారెడ్డిలోని పీఎస్సార్ గార్డెన్‌లో మరో 210 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఐదేళ్ల వయసు నుంచి 15 ఏండ్ల మధ్య ఉన్న పిల్లలకు సైకిళ్లు అందించి వారిలో ఉత్సాహం నింపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత వారం టోకెన్‌లు ఇచ్చిన వారికి సైకిళ్లు అందజేశాం. టోకెన్‌లు లేని చిన్నారులకు మరోసారి సైకిళ్లు పంపిణీ చేస్తాం. అందరి చిన్నారుల ఆధార్ కార్డు, పేరెంట్స్ ఫోన్ నెంబర్లతో కూడిన వివరాలు తీసుకోవాలని నిర్వాహకులకు చెప్పాను. సైకిళ్లు రాని చిన్నారులు ఎవరూ ఆందోళన చెందొద్దు. పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తాం అని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Ashika Ranganath | హీరోయిన్‌ది కాదు దర్శకుడిదే తప్పు – పెద్ది వివాదంపై కన్నడ హీరోయిన్ కామెంట్స్
జూన్ 6, 2026

CP Ramesh | ప్రైవేట్ ట్రావెల్స్తో సైబరాబాద్ పోలీసుల సమావేశం.. విద్యార్థుల భద్రతకు కీలక ఆదేశాలు..
జూన్ 6, 2026

Minister Uttam Kumar reddy | బియ్యం ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●Minister Uttam Kumar reddy | బియ్యం ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Minister Sridhar babu | సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్ బాబు
- ●CM Revanth Reddy | మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Samantha | మా ఇంటి బంగారంలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సమంత కాదట - నాచురల్ బ్యూటీతో అనుకొని...
- ●State-wise GST Collection May 2026 | దేశ ఖజానాకు కాసుల వర్షం.. మే 2026 జీఎస్టీ వసూళ్లలో టాప్ రాష్ట్రాలు ఇవే!
- ●KCR Cricket Cup | ఆస్ట్రేలియాలో కేసీఆర్ క్రికెట్ కప్.. పోస్టర్‌ను ఆవిష్కరించిన కేటీఆర్

Minister Uttam Kumar reddy | బియ్యం ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Minister Sridhar babu | సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్ బాబు

CM Revanth Reddy | మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నం : సీఎం రేవంత్‌రెడ్డి

Samantha | మా ఇంటి బంగారంలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సమంత కాదట - నాచురల్ బ్యూటీతో అనుకొని...



