త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ITR | జూలై 31లోపు ఐటీఆర్ ను ఫైల్ చేయకపోతే నష్టమే.. ఈ 6 ప్రయోజనాల‌ను కోల్పోతారు..

ITR | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడం కేవలం ఆదాయ వివరాలను ఆ శాఖకు తెలియజేయడానికే కాదు, ఆర్థిక భవిష్యత్తుకు కూడా ఎంతో కీలకం. జూలై 31 గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేస్తే ట్యాక్స్ రీఫండ్ త్వరగా పొందడమే కాకుండా రుణాలు, వీసాలు, బీమా వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. చాలా మంది దీనిని కేవలం పన్ను ప్రక్రియగా భావించినప్పటికీ, దీని వల్ల కలిగే లాభాలు మరింత విస్తృతంగా ఉంటాయి.

S

Business | Published On Jun 6, 2026, 4.19 pm IST

ITR | జూలై 31లోపు ఐటీఆర్ ను ఫైల్ చేయకపోతే నష్టమే.. ఈ 6 ప్రయోజనాల‌ను కోల్పోతారు..
Advertisement

ITR | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడం కేవలం ఆదాయ వివరాలను ఆ శాఖకు తెలియజేయడానికే కాదు, ఆర్థిక భవిష్యత్తుకు కూడా ఎంతో కీలకం. జూలై 31 గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేస్తే ట్యాక్స్ రీఫండ్ త్వరగా పొందడమే కాకుండా రుణాలు, వీసాలు, బీమా వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. చాలా మంది దీనిని కేవలం పన్ను ప్రక్రియగా భావించినప్పటికీ, దీని వల్ల కలిగే లాభాలు మరింత విస్తృతంగా ఉంటాయి. ప్రభుత్వం కొన్ని వర్గాల సీనియర్ సిటిజన్లకు ఐటీఆర్ దాఖలు నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ, మిగతా పన్ను చెల్లింపుదారులందరూ నిర్ణీత గడువులోపు రిటర్న్ దాఖలు చేయడం అవసరం. 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన సీనియర్ సిటిజన్లు కొన్ని షరతులు నెరవేర్చినట్లయితే ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు.

75 ఏళ్ల‌కు పైబ‌డితే..

75 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఐటీఆర్ వ‌ద్ద‌నుకుంటే ప‌లు ష‌ర‌తుల‌ను పాటించాల్సి ఉంటుంది. వారి ఆదాయ వనరులు కేవలం పెన్షన్, బ్యాంక్ వడ్డీ మాత్రమే అయి ఉండాలి. పెన్షన్ జమ అయ్యే అదే బ్యాంక్ నుంచి వడ్డీ ఆదాయం రావాలి. దీనికి సంబంధించిన డిక్లరేషన్‌ను బ్యాంక్‌కు సమర్పించి ఉండాలి. ఆ బ్యాంక్ నిబంధనల ప్రకారం టీడీఎస్‌ను మినహాయిస్తూ ఉండాలి. ఇక ఐటీఆర్‌ను స‌మ‌యానికి ఫైల్ చేయ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా హోమ్ లోన్, కారు లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంకులు ముందుగా ఐటీఆర్ కాపీలను అడుగుతాయి. ఐటీఆర్ ను ఆదాయానికి అత్యంత విశ్వసనీయ ఆధారంగా పరిగణిస్తారు. దీంతో రుణాల ఆమోద ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. అలాగే జీతం, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ లేదా అద్దె ఆదాయంపై కొన్నిసార్లు అవసరానికి మించి టీడీఎస్ కట్ అవుతుంది. ఈ అదనపు మొత్తాన్ని ప్రభుత్వం నుంచి తిరిగి పొందాలంటే ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి.

అనేక లాభాలు..

ఐటీఆర్ కాపీ ఆదాయం చిరునామాకు బలమైన ఆధారంగా పనిచేస్తుంది. పాస్‌పోర్ట్ పొందడం, విదేశీ వీసా దరఖాస్తు చేయడం వంటి సందర్భాల్లో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. షేర్ మార్కెట్ లేదా వ్యాపారంలో నష్టాలు వస్తే భ‌విష్యత్ సంవత్సరాల్లో వచ్చే లాభాల నుంచి ఆ నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే జూలై 31లోపు రిటర్న్ దాఖలు చేయాలి. విదేశాలకు వెళ్లే ప్రణాళిక ఉన్నవారికి వీసా ఇంటర్వ్యూల సమయంలో ఐటీఆర్ పత్రాలు కీలకంగా మారుతాయి. అలాగే ప్రభుత్వ టెండర్లలో పాల్గొనాలన్నా ఐటీఆర్ రికార్డులు తప్పనిసరిగా అవసరం అవుతాయి. కుటుంబ భద్రత కోసం అధిక కవరేజ్ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే, బీమా సంస్థలు అర్హతను నిర్ధారించడానికి ఐటీఆర్ కాపీలను కోరుతాయి. క్రమం తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేసే వారికి పాలసీ ఆమోదం సులభమవుతుంది. సమయానికి ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా కేవలం పన్ను నిబంధనలు పాటించినట్లే కాకుండా, భవిష్యత్తులో అవసరమయ్యే అనేక ఆర్థిక, చట్టపరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అందువల్ల గడువు ముగిసేలోపు రిటర్న్ ఫైల్ చేయడం మంచిది.

Advertisement
Advertisement