త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | కంటైన‌ర్‌ను ఢీకొట్టిన టిప్ప‌ర్‌.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవ‌ర్‌

Road Accident | హైద‌రాబాద్‌లోని హయత్‌నగర్‌లో (Hayatnagar) రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున హ‌య‌త్‌న‌గ‌ర్ ఆర్టీసీ కాల‌నీ వ‌ద్ద విజయవాడ జాతీయ రహదారిపై కంటైన‌ర్ లారీని వెనుక నుంచి టిప్ప‌ర్ ఢీకొట్టింది.

G

Hyderabad | Published On May 27, 2026, 10.16 am IST

Road Accident | కంటైన‌ర్‌ను ఢీకొట్టిన టిప్ప‌ర్‌.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవ‌ర్‌
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని హయత్‌నగర్‌లో (Hayatnagar) రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున హ‌య‌త్‌న‌గ‌ర్ ఆర్టీసీ కాల‌నీ వ‌ద్ద విజయవాడ జాతీయ రహదారిపై కంటైన‌ర్ లారీని వెనుక నుంచి టిప్ప‌ర్ ఢీకొట్టింది.

కంటైన‌ర్ లారీ టైర్ పేల‌డంతో అది ఒక్క‌సారిగా ఆగిపోయింది. దీంతో వెనుక‌నే వ‌స్తున్న టిప్ప‌ర్ దానిని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి టిప్ప‌ర్ ముందుభాగం నుజ్జునుజ్జు అవ‌డంతో చిన్నరావిర్యాల గ్రామానికి చెందిన డ్రైవర్‌ సంపంగి నవీన్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. పోలీసులు, అంబులెన్స్‌ సిబ్బంది గంటపాటు శ్రమించి కట్టర్ల సాయంతో ఆయ‌న‌ను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతడిని సమీపంలోని ప్రైవేటు ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప్రమాద ఘటనతో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. దీంతో సర్వీస్‌ రోడ్డులోకి వాహనాలను మళ్లించారు.

Advertisement
Advertisement