Iran War | ఇరాన్ యుద్ధంలో ఎనిమిది మంది భారతీయ పౌరులు మృతి : విదేశాంగ శాఖ
Iran War | పశ్చిమాసియా (Middle East) యుద్ధంలో ఎనిమిది మంది భారతీయులు సైతం ప్రాణాలు కోల్పోయినట్లు (8 Indians died) ప్రభుత్వం ప్రకటించింది. ఒకరు గల్లంతైనట్లు తెలిపింది.
Iran War | పశ్చిమాసియా (Middle East)లో ఉద్రిక్తతలు మరింత (Iran War) ముదిరాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను పెంచాయి. అదే సమయంలో టెహ్రాన్ సైతం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులను కొనసాగిస్తోంది. ఇక నెల రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం కారణంగా దాదాపు 3 వేల మందికిపైగానే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఈ యుద్ధంలో ఎనిమిది మంది భారతీయులు సైతం ప్రాణాలు కోల్పోయినట్లు (8 Indians died) ప్రభుత్వం ప్రకటించింది.
మధ్యప్రాచ్యంలో జరిగిన వివిధ ఘటనల్లో ఎనిమిది మంది భారతీయులు మరణించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) స్పష్టం చేసింది. ఒకరు గల్లంతైనట్లు తెలిపింది. "వివిధ ఘటనల్లో దురదృష్టవశాత్తూ ఎనిమిది మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు గల్లంతయ్యారు" అని పేర్కొంది. ఇక ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మధ్యప్రాచ్యం నుంచి సుమారు 5.5 లక్షల మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు స్పష్టం చేసింది. వివాదం ముగింపు పలికేందుకు చర్చలు, దౌత్యమే మార్గమని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
Also Read..
గాంధీ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ.. 2.8 కిలోల ప్లీహాం తొలగింపు
పారాసైలింగ్ చేస్తుండగా తెగిపోయిన తాడు.. గోవా బీచ్‌లో టూరిస్ట్‌కు భయానక అనుభవం
ఓటు వెయ్యి.. హల్వా తీసుకో.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈసీ
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



