US Accident | న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం.. నల్లగొండ జిల్లా యువకుడు దుర్మరణం
US Accident | ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన అతనికి వారం రోజుల క్రితమే ఉద్యోగం వచ్చింది. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో (US Accident) అతడు మృతిచెందాడు.
US Accident | త్రినేత్ర న్యూస్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన అతనికి వారం రోజుల క్రితమే ఉద్యోగం వచ్చింది. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో (US Accident) అతడు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా మునుగోడు (Munugode) పట్టణానికి చెందిన ఈరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడు సాయితేజ (25) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. వారం రోజుల క్రితమే అతడికి ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తుండగా రోడ్డుకు జింక అడ్డుగా వచ్చింది. జింకను ఢీకొట్టడంతో వాహనం ఆగిపోయింది. దీంతో వెనక నుంచి వచ్చిన ఓ వ్యాను సాయితేజ కారును ఢీకొట్టింది. తీవ్రగా గాయపడిన అతడిని తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కారులో ఉన్న మరో వ్యక్తిని హెలికాప్టర్‌లో దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
కాగా, తమ కుమారుడు ఉద్యోగం సాధించాడనే సంతోషం మరువకముందే మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆదివారం రాత్రికి భౌతికకాయం మునుగోడుకు వచ్చే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●E-Waste | టెక్నాలజీ పెరిగే.. ఈ-వ్యర్థాలు పేరుకుపోయే!
- ●MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే
- ●Traffic Restrictions | రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణ.. ఆ మార్గంలో 6 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు
- ●Gold Prices | దీపావళికి బంగారం కొన్నారా? ఇప్పుడు దాని విలువ ఎంతంటే?
- ●Congress | పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని కలవండి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం
- ●Donald Trump | భారత్‌లోనే తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయ్.. ఫెడ్‌పై ట్రంప్ విమర్శలు

E-Waste | టెక్నాలజీ పెరిగే.. ఈ-వ్యర్థాలు పేరుకుపోయే!

MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే

Traffic Restrictions | రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణ.. ఆ మార్గంలో 6 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

Gold Prices | దీపావళికి బంగారం కొన్నారా? ఇప్పుడు దాని విలువ ఎంతంటే?





