Methuku Anand | ఇది పల్లీ బఠాణీల కేబినెట్‌లా మారింది
Methuku Anand | రాష్ట్రంలో పల్లీ బఠాణీల కేబినెట్ నడుస్తోందని.. చాయ్ బిస్కెట్ల కోసమే సమావేశాలు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎద్దేవా చేశారు. బడే భాయ్ వెనుక ఉండడంతోనే గుజరాత్ వాళ్లకు టెండర్లు ఇస్తున్నారని ఆరోపించారు.
- చాయ్, బిస్కెట్ల కోసమే సమావేశాలు పెడుతున్నరు
- బడే భాయ్, చంద్రబాబు చెప్పినోళ్లకే టెండర్లు ఇస్తున్నరు
- హరీశ్‌కు ఉన్న సబ్జెక్టు రేవంత్‌కు ఉందా?
- మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విమర్శలు
Methuku Anand | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో పల్లీ బఠాణీల కేబినెట్ నడుస్తోందని.. చాయ్ బిస్కెట్ల కోసమే సమావేశాలు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎద్దేవా చేశారు. గురుకుల టెండర్ల వెనుక ఎవరు ఉన్నారో మంత్రులకు తెలియదా అని నిలదీశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బడే భాయ్ వెనుక ఉండడంతోనే గుజరాత్ వాళ్లకు టెండర్లు ఇస్తున్నారని ఆరోపించారు.
బతుకమ్మ చీరలు గుజరాత్ వాళ్లకు ఇచ్చారు. బడే భాయ్ వెనుక ఉన్నారు. కాబట్టే గురుకులాల టెండర్లు గుజరాత్ వాళ్లకు ఇస్తున్నారు. బడే భాయ్, చంద్రబాబులు చెప్పిన వారికి కాంట్రాక్టులు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా వేం నరేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ క్యాబినెట్ టైం పాస్ క్యాబినెట్‌లా మారింది.
విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి నాశనం చేశారు. గురుకులాలకు వెళ్లాలంటేనే పిల్లలు భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తున్నారు. తుమ్మితే రేవంత్ పదవి ఊడిపోతుంది. హరీశ్‌రావుకు ఉన్న సబ్జెక్ట్ రేవంత్ రెడ్డి దగ్గర ఉందా? కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ రెడ్డి చెప్పారు.. కానీ తీసుకోలేదు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇప్పటికే ఐదు సార్లు రాజీనామా గురించి మాట్లాడారు. టెస్కో ప్రతినిధులు, కొండా సురేఖ వేం నరేందర్ రెడ్డికి లెటర్ ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఆనంద్ మండిపడ్డారు.
ఈ సమావేశంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్ , ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్ నాయక్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MVI Venkanna Road Accident | ఎంవీఐ వెంకన్న భౌతికకాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు
- ●RDS Project | ఆర్డీఎస్ను ఆధునీకరిస్తాం.. తుంగభద్ర జలాలపై మన హక్కులను కాపాడుతాం : మంత్రి ఉత్తమ్
- ●DTO Venkanna | డీటీవో వెంకన్న మృతిపై విచారణకు ఆదేశించిన సర్కారు
- ●MLC Dasoju Sravan | ట్రంప్ విషయంలో ఏఐసీసీ స్టాండ్ ఏంటి..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
- ●Elephant poop | ఏనుగు పేడతో కాఫీ.. తయారీ విధానం, ధర తెలిస్తే షాకే..!
- ●Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ - డిజాస్టర్ టాక్‌తో నలభై ఐదు కోట్ల కలెక్షన్స్

MVI Venkanna Road Accident | ఎంవీఐ వెంకన్న భౌతికకాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు

RDS Project | ఆర్డీఎస్ను ఆధునీకరిస్తాం.. తుంగభద్ర జలాలపై మన హక్కులను కాపాడుతాం : మంత్రి ఉత్తమ్

DTO Venkanna | డీటీవో వెంకన్న మృతిపై విచారణకు ఆదేశించిన సర్కారు

MLC Dasoju Sravan | ట్రంప్ విషయంలో ఏఐసీసీ స్టాండ్ ఏంటి..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్






