Singareni | సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. రూ. కోటిన్నర వరకు బీమా రక్షణ
Singareni | సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి మరో ముందడుగు వేసింది. ఉద్యోగులు, కార్మికులు విధి నిర్వహణలో మరణించినా, శాశ్వత వైకల్యం సంభవించినా.. రూ. కోటి నుంచి రూ. 1.50 కోట్ల వరకు బీమా రక్షణ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Singareni | త్రినేత్ర.న్యూస్ : సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి మరో ముందడుగు వేసింది. ఉద్యోగులు, కార్మికులు విధి నిర్వహణలో మరణించినా, శాశ్వత వైకల్యం సంభవించినా.. రూ. కోటి నుంచి రూ. 1.50 కోట్ల వరకు బీమా రక్షణ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా కార్మికుడు సహజంగా మరణిస్తే.. అలాంటి వారికి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు బీమా సదుపాయం కల్పించారు. ఈ మేరకు సింగరేణి సంస్థ.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ ఖాతాలు కలిగిన ఉన్న సింగరేణి ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు చేకూరనున్నాయి. అదనంగా పలు ప్రత్యేక బ్యాంకింగ్ రాయితీలు కూడా అందుబాటులో ఉంటాయి.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో, సింగరేణి ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవతో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. సోమవారం కొత్తగూడెం హెడ్ ఆఫీసులో జనరల్ మేనేజర్ (పర్సనల్) – వెల్ఫేర్ అండ్ సీఎస్ఆర్ జివి కిరణ్ కుమార్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ హెడ్ ఎవి రమణమూర్తి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
జీఎం (పర్సనల్) ఐఆర్ అండ్ పీఎం కవితా నాయుడు, జీఎం (పర్సనల్) ఈఈ అండ్ ఆర్‌సీ ఏజేఎం మురళీధర్ రావు, జీఎం (ఎఫ్ అండ్ ఏ) ఎన్ చక్రవర్తి, డీజీఎంలు (పర్సనల్) కేసా నారాయణరావు, ముకుంద సత్యనారాయణ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ రీజియన్ హెడ్ ఐ. రాజ్‌కుమార్, చీఫ్ మేనేజర్లు అబ్దుల్ ఖాదర్ షేక్, బి నరేందర్ రెడ్డి, కొత్తగూడెం బ్రాంచ్ హెడ్ జి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MVI Venkanna Road Accident | ఎంవీఐ వెంకన్న భౌతికకాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు
- ●RDS Project | ఆర్డీఎస్ను ఆధునీకరిస్తాం.. తుంగభద్ర జలాలపై మన హక్కులను కాపాడుతాం : మంత్రి ఉత్తమ్
- ●DTO Venkanna | డీటీవో వెంకన్న మృతిపై విచారణకు ఆదేశించిన సర్కారు
- ●MLC Dasoju Sravan | ట్రంప్ విషయంలో ఏఐసీసీ స్టాండ్ ఏంటి..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
- ●Methuku Anand | ఇది పల్లీ బఠాణీల కేబినెట్‌లా మారింది
- ●Elephant poop | ఏనుగు పేడతో కాఫీ.. తయారీ విధానం, ధర తెలిస్తే షాకే..!

MVI Venkanna Road Accident | ఎంవీఐ వెంకన్న భౌతికకాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు

RDS Project | ఆర్డీఎస్ను ఆధునీకరిస్తాం.. తుంగభద్ర జలాలపై మన హక్కులను కాపాడుతాం : మంత్రి ఉత్తమ్

DTO Venkanna | డీటీవో వెంకన్న మృతిపై విచారణకు ఆదేశించిన సర్కారు

MLC Dasoju Sravan | ట్రంప్ విషయంలో ఏఐసీసీ స్టాండ్ ఏంటి..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్






