MLC Dasoju Sravan | ట్రంప్ విషయంలో ఏఐసీసీ స్టాండ్ ఏంటి..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
MLC Dasoju Sravan | హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో యూఎస్ కాన్సులేట్ పక్కనే కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూను అధికారికంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేయడంపై మీ అభిప్రాయం ఏంటని రాహుల్ గాంధీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిలదీశారు.
MLC Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో యూఎస్ కాన్సులేట్ పక్కనే కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూను అధికారికంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేయడంపై మీ అభిప్రాయం ఏంటని రాహుల్ గాంధీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిలదీశారు. మీరు కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాజకీయ ద్వంద్వ నీతిని ఎలా సమర్థిస్తారని రాహుల్‌ను శ్రవణ్ అడిగారు. ఈ మేరకు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు.
ఢిల్లీ సార్వభౌమాధికార నినాదాలు వర్సెస్ హైదరాబాద్ రోడ్డు నాటకాలు..! డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టాంట్ ఏంటి..? రేవంత్ కాంగ్రెస్ జాతీయ సిద్ధాంతాన్ని విస్మరించి ప్రయివేట్ ఫ్రాంచైజీ రాజకీయాన్ని తెరపైకి తెచ్చిందా..? వంటి అంశాలను లేఖలో లేవనెత్తారు.
రెండు గుర్రాల స్వారీ చేస్తున్న కాంగ్రెస్.. ట్రంప్ విషయంలో ఏఐసీసీ స్టాండ్ ఏంటి..? అని నిలదీశారు. ట్రంప్ పర్యటనపై ఏఐసీసీ విమర్శలు నిజమైతే.. హైదరాబాద్‌లో 'డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ' ఎలా వేస్తారు? రాహుల్ కాంగ్రెస్ సిద్ధాంతమా? రేవంత్ కాంగ్రెస్ ప్రైవేట్ ఫ్రాంచైజీ రాజకీయామా? అని ప్రశ్నించారు.
డొనాల్డ్ ట్రంప్ భారత సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా ఎగతాళి చేస్తున్నారని, 10 శాతం టారిఫ్‌లతో భారత ఆర్థిక స్థిరత్వాన్ని బెదిరిస్తున్నారని, మన నావికుల మరణాలను కేవలం ఒక వృత్తిపరమైన సంఘటనగా కొట్టిపారేస్తున్నారని జాతీయ కాంగ్రెస్ నిజంగా నమ్మితే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రధాన రహదారికి డొనాల్డ్ ట్రంప్ పేరును ఎందుకు పెడుతొంది..? అని నిలదీశారు. విదేశాంగ మంత్రిని సమావేశాల మినిట్స్ బయటపెట్టాలని శ్రీ ఖేరా సవాల్ చేస్తూ, భారతదేశం ఎందుకు ఒక విధేయుడైన సేవకుడిలా లొంగిపోతోందని ప్రశ్నిస్తుంటే, మీ స్వతం ముఖ్యమంత్రి దానికి పూర్తిగా విరుద్ధంగా అత్యంత లొంగుబాటు తత్వంతో ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ రాజ్యామంటూ నిరసనలు.. తెలంగాణలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ల ధ్వంస రచనలపై సంబరాలా? రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ గాంధీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ పాలనను అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ మార్క్ ద్వంద్వ నీతి బట్టబయలైంది. ఢిల్లీ లొంగుబాటు ఆరోపణలపై ఏఐసీసీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలైన కాంగ్రెస్ ఏది? ఢిల్లీలో పోరాడేదా.. తెలంగాణ వీధుల్లో సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టేదా? అని దాసోజు శ్రవణ్ నిలదీశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Tollywood | ఒక్క లిప్‌లాక్ లేదు .. అయినా "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారు - సెన్సార్ తీరుపై దీవాన టీమ్ ఫైర్
- ●Cybercrime Refund Hyderabad | ఆన్లైన్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు రూ.21 కోట్ల 'రీఫండ్'
- ●Keerthy Suresh | ఏకంగా ఏడు సినిమాలను లైన్లో పెట్టిన మహానటి - నాలుగు భాషల్లో బిజీ
- ●RS Praveen Kumar | భగీరథ్ ఒక్కడికే స్పెషల్‌గా పరీక్షలు పెట్టడం ఏంటి?
- ●TG Rains | ఐదురోజులు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
- ●MVI Venkanna Road Accident | ఎంవీఐ వెంకన్న భౌతికకాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు

Tollywood | ఒక్క లిప్‌లాక్ లేదు .. అయినా "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారు - సెన్సార్ తీరుపై దీవాన టీమ్ ఫైర్

Cybercrime Refund Hyderabad | ఆన్లైన్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు రూ.21 కోట్ల 'రీఫండ్'

Keerthy Suresh | ఏకంగా ఏడు సినిమాలను లైన్లో పెట్టిన మహానటి - నాలుగు భాషల్లో బిజీ

RS Praveen Kumar | భగీరథ్ ఒక్కడికే స్పెషల్‌గా పరీక్షలు పెట్టడం ఏంటి?





