త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shiv Sena UBT | మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఏక్‌నాథ్ శిండే వ‌ర్గంలో చేర‌నున్న శివ‌సేన‌ యూబీటీ ఎంపీలు..

Shiv Sena UBT Split | ప్రాంతీయ పార్టీల్లో చీలిక‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ప‌శ్చిమ‌బెంగాల్‌లో టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు ఎన్డీయే కూట‌మిలో చేరిపోయారు. ఆప‌రేష‌న్ టైగ‌ర్‌లో (Operation Tiger) భాగంగా మ‌హారాష్ట్ర‌లో శివసేన ఉద్ధ‌వ్ ఠాక్రే వ‌ర్గం (Uddhav Thackeray) చీలిపోయింది.

G

National | Published On Jun 22, 2026, 6.56 am IST

Shiv Sena UBT | మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఏక్‌నాథ్ శిండే వ‌ర్గంలో చేర‌నున్న శివ‌సేన‌ యూబీటీ ఎంపీలు..
Advertisement

Shiv Sena UBT Split | త్రినేత్ర.న్యూస్: ప్రాంతీయ పార్టీల్లో చీలిక‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ప‌శ్చిమ‌బెంగాల్‌లో టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు ఎన్డీయే కూట‌మిలో చేరిపోయారు. ఆప‌రేష‌న్ టైగ‌ర్‌లో (Operation Tiger) భాగంగా మ‌హారాష్ట్ర‌లో శివసేన ఉద్ధ‌వ్ ఠాక్రే వ‌ర్గం (Uddhav Thackeray) చీలిపోయింది. శివ‌సేన (యూబీటీ)కి (Shiv Sena UBT) ఉన్న తొమ్మిది మంది ఎంపీల్లో ఆరుగురు వేరు కుంప‌టి పెట్టుకున్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వారంతా ఉప‌ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివ‌సేన‌లో చేర‌నున్నారు. దీంతో మూడింట రెండొంతుల బ‌లం ఉండ‌టంతో తమపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-defection law) వర్తించదని చెబుతున్నారు.

మ‌రోవైపు చీలిక‌ల నేప‌థ్యంలో మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు పార్టీ కార్యాల‌యంలో శివ‌సేన (యూబీటీ) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స‌మావేశం కానున్నారు.

ఏమిటీ 'ఆపరేషన్ టైగర్'?

ప్రస్తుతం శివసేన (యూబీటీ)కు మొత్తం తొమ్మిది మంది ఎంపీలు ఉండగా.. అందులో ఏకంగా ఆరుగురు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఈ రెబల్స్ వెనుక షిండే క్యాంపు అమలు చేస్తున్న రాజకీయ వ్యూహమే ఈ 'ఆపరేషన్ టైగర్'.

జూన్ 16న దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరుకున్న ఈ ఎంపీలు నోయిడాలోని ఓ హోటల్‌లో బస చేశారు. మరుసటి రోజు ఉదయం వేర్వేరుగా స్పీకర్ ఓం బిర్లాను కలిసి తాము షిండే వర్గంతో విలీనం అవుతున్నట్లు లేఖ ఇచ్చారు. పార్లమెంట్‌లో తమ సీటింగ్ అరేంజ్‌మెంట్ మార్చాలని కూడా కోరారు. ఆ తర్వాత వెంటనే చెన్నై, వారణాసి, పుణె లాంటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఆదివారం నాటి ప్రెస్ మీట్ కోసం వీరంతా మళ్లీ ముంబై చేరుకుంటున్నారు.

Advertisement
Advertisement