త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DTO Venkanna | డీటీవో వెంక‌న్న మృతిపై విచార‌ణ‌కు ఆదేశించిన స‌ర్కారు

DTO Venkanna | భూపాలపల్లిలో విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా శాఖ అధికారి ఎం వెంకన్న మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సోమ‌వారం ఉద‌యం సుమారు 9.30 గంట‌ల స‌మ‌యంలో చెల్పూర్‌లోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో ఆయ‌న మృతి చెందారు.

P

Telangana | Published On Jun 22, 2026, 7.07 pm IST

DTO Venkanna | డీటీవో వెంక‌న్న మృతిపై విచార‌ణ‌కు ఆదేశించిన స‌ర్కారు
Advertisement

DTO Venkanna | భూపాలపల్లిలో విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా శాఖ అధికారి ఎం వెంకన్న మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సోమ‌వారం ఉద‌యం సుమారు 9.30 గంట‌ల స‌మ‌యంలో చెల్పూర్‌లోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో ఆయ‌న మృతి చెందారు. డ్యూటీలో ఉన్న సమయంలో కోల్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఆయనపై దూసుకెళ్లడంతో ఎం వెంకన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. విధి నిర్వహణలో ఉన్న అధికారిని కోల్పోవడం ప్రభుత్వానికి తీవ్ర ఆవేదన కలిగించింద‌ని తెలిపింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు, పరిస్థితులను నిగ్గు తేల్చాల‌ని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన భద్రతా చర్యలు సూచించాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (ఆర్‌ఎస్‌సీ) ఎం చంద్రశేఖర్ గౌడ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా ఆదేశాల్లో ప్ర‌భుత్వం పేర్కొంది. రోడ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ సిబ్బంది భద్రత కోసం ప్రోటోకాల్స్‌లో మార్పులు, అవసరమైన పరికరాలు, ఎస్‌ఓపీ మార్పులపై కూడా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ ఘటనపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ స్పష్టం చేసింది.

 

Advertisement
Advertisement