Criminal Cases | తమిళనాడులో 18 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు.. ఎన్నికల వేళ ఆందోళన కలిగిస్తోన్న నివేదిక
Criminal Cases | తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu Assembly Polls) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు సంబంధించి విడుదలైన ఓ నివేదిక ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
Criminal Cases | తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu Assembly Polls) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు సంబంధించి విడుదలైన ఓ నివేదిక ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల బరిలో నిలిచిన దాదాపు 18 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు (Criminal Cases) ఉన్నట్లు వెల్లడైంది. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, టీన్యూ ఓ నివేదికను విడదుల చేశాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో 3,992 మంది అఫిడవిట్లు విశ్లేషించగా అందులో 722 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. అందులో 404 మందిపై తీవ్రమైన కేసులున్నట్లు వెల్లడైంది. గతంతో పోలిస్తే క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల సంఖ్య రెట్టింపు అయినట్లు సదరు నివేదిక తెలిపింది. 2021 ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు 13 శాతంగా ఉండగా.. ఈసారి అది 18 శాతానికి చేరింది. ముఖ్యంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య కూడా రెట్టింపు కావడం గమనార్హం.
పార్టీల వారీగా చూస్తే ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే అభ్యర్థుల్లో ఏకంగా 69 శాతం మంది నేరచరిత్ర కలిగిన వారే కావడం గమనార్హం. అధికార డీఎంకేతో పాటు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీల్లో 40 శాతం మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, పీఎంకే, డీఎండీకే, వామపక్ష పార్టీలు సైతం నేరచరితులకు టికెట్లు ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలాఉండగా.. ఎన్నికల బరిలో ఉన్న మొత్తం 3,992 మంది అభ్యర్థులు ప్రకటించిన ఆస్తుల విలువ రూ.20,678 కోట్లు.
Also Read..
అనంత్ చేతికి శివుడి థీమ్‌తో ప్రత్యేకమైన వాచ్.. ధర, ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!
ఒక్కసారి చార్జ్ చేస్తే 681 కిలోమీటర్ల మైలేజ్.. టెస్లా నుంచి కొత్త కారు లాంచ్..
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



