త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalki Movie | ప్రభాస్‌ కల్కి మూవీ నుంచి బిగ్‌ అప్‌డేట్‌..!

ప్రభాస్ నటించిన ‘కల్కి’ సీక్వెల్‌పై బిగ్ అప్‌డేట్ వచ్చింది. హైదరాబాద్‌లో భారీ సెట్ నిర్మాణం జరుగుతుండగా, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కలిసి కనిపించే కీలక సన్నివేశాన్ని చిత్రీకరించే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కర్ణుడి కథతో మరింత ఆసక్తికరంగా ఉండబోతున్న ‘కల్కి 2’పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

P

Entertainment | Published On Apr 22, 2026, 3.00 pm IST

Kalki Movie | ప్రభాస్‌ కల్కి మూవీ నుంచి బిగ్‌ అప్‌డేట్‌..!
Advertisement

Kalki Movie | రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. రూ.వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం క్లైమాక్స్‌లో భైరవ పాత్రలో కర్ణుడి కోణాన్ని పరిచయం చేయడంతో రెండో భాగంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వినీదత్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇక ‘కల్కి 2’ షూటింగ్‌కు సంబంధించి తాజాగా ఫిలింనగర్‌లో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్ నిర్మాణం జరుగుతోందని సమాచారం. ముఖ్యంగా సినిమాలో కీలకంగా నిలిచే ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను ఈ సెట్‌లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), కమల్ హాసన్ (సుప్రీమ్ యాస్కిన్) పాత్రలు ఒకేసారి తెరపై కనిపించేలా రూపకల్పన చేస్తున్నారని టాక్. ముగ్గురు దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే ఈ ఘట్టం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందనే అంచనాలున్నాయి. ఇక రెండో భాగానికి ‘కర్ణ 3102 బీసీ’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. తొలి భాగంలో కల్కి అవతారం నేపథ్యాన్ని చూపించగా.. సీక్వెల్‌లో కర్ణుడి పునరాగమనం, ద్వాపరయుగానికి చెందిన కీలక సంఘటనలను చూపించనున్నట్లుగా టాక్‌. మొత్తం కథనం కర్ణుడి పాత్ర చుట్టూ తిరిగేలా, మైథాలజీ అంశాలను మరింత బలంగా ఆవిష్కరించే దిశగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement