Massive Fire | వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
Massive Fire | థాయ్‌లాండ్‌లోని (Thailand) ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫుకెట్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మరో 36 మంది గాయపడ్డారు.
International | Published On Nov 16, 2026, 10.30 am IST
Massive Fire | త్రినేత్ర న్యూస్: థాయ్‌లాండ్‌లోని (Thailand) ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫుకెట్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మరో 36 మంది గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున 3.17 గంటల సమయంలో ఫుకెట్‌లోని (Phuket) పటాంగ్ సమీపంలో ఉన్న ఓ వాణిజ్య భవనంలో (Commercial Hhophouse) మంటలు చెలరేగాయి. వాహనాల అద్దె వ్యాపారం నిర్వహించే భవనంలో తొలుత మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న పలు భవనాలకు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బిల్డింగ్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే 11 మంది చనిపోయారు. క్షతగాత్రుల్లో 15 మంది థాయ్ పౌరులు కాగా, మరొకరు మయన్మార్‌కు చెందినవారు ఉన్నారు. కాగా, బాధితుల్లో పర్యాటకులెవరూ లేరని గాయపడలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా నాలుగు నెలల క్రితం బ్యాంకాక్‌లోని ఓ బార్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 27 మంది మరణించిన విషయం తెలిసిందే.
11 people have died and 36 reportedly injured following a major fire in Patong, Phuket, in the early hours of 16 November.
The fire broke out at around 03:20am at a commercial building on Phang Muang Sai Kor Road and spread to neighbouring buildings.
Firefighters brought the blaze under control after approximately 40–50 minutes. Authorities are investigating the incident.
#thailand #phuket #fire #patong #ไฟไหม้ #ป่าตอง
— Thai Enquirer (@ThaiEnquirer) November 16, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Girls Hostel | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం..
- ●Varsha Turkar | స్నేహితుడితో కలసి బయటకు వెళ్లింది.. అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది..
- ●JNTU | హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి.. జేఎన్టీయూలో విద్యార్థి ఆత్మహత్య
- ●Jatayu | సీతమ్మను ఎత్తుకెళ్తుండగా.. రావణుడితో పోరాడి జటాయువు ప్రాణాలు విడిచింది ఇక్కడే..!
- ●TG TET | నేటి నుంచి టీజీ టెట్ దరఖాస్తులు షురూ..
- ●Horoscope | నవంబర్ 16 సోమవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Girls Hostel | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం..

Varsha Turkar | స్నేహితుడితో కలసి బయటకు వెళ్లింది.. అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది..

JNTU | హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి.. జేఎన్టీయూలో విద్యార్థి ఆత్మహత్య

Jatayu | సీతమ్మను ఎత్తుకెళ్తుండగా.. రావణుడితో పోరాడి జటాయువు ప్రాణాలు విడిచింది ఇక్కడే..!






