Donald Trump | ఇరాన్‌తో డీల్ కుదిరింది.. త్వరలోనే సంతకాలు.. ట్రంప్ కీలక ప్రకటన
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై (Iran) సైనిక దాడులను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.
International | Published On Jun 12, 2026, 11.39 am IST
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై (Iran) సైనిక దాడులను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అణ్వాయుధాల అంశంపై ఇరాన్‌తో ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై రెండు దేశాలు సంతకాలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
గురువారం మధ్యాహ్నం ఓవెల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించే ఒప్పందం దాదాపు ఖరారైనట్లు చెప్పారు. ఈ వారాంతంలో యూరప్‌లో (Europe) దీనిపై సంతకాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ చర్చల గురించి ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ సహా మధ్యప్రాచ్య దేశాల నాయకులతో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించినట్లు ట్రంప్ చెప్పారు. డీల్‌పై సంతకాల తర్వాత హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పూర్తిగా తెరుచుకుంటుందని అధ్యక్షుడు స్పష్టం చేశారు.
అయితే, ట్రంప్ ప్రకటనపై ఇరాన్ భిన్నంగా స్పందించింది. డీల్‌పై తాము ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాగేహి తెలిపారు. చర్చలకు చెందిన అంశాల్లో చాలా వరకు డీల్ ఓకే చేసుకున్నా.. అమెరికా మాత్రం ప్రతి చర్చల్లోనూ తన అభిప్రాయాలను మార్చుకుంటోందని ఆరోపించారు.
Also Read..
సింగ్ గీతం రివ్యూ - మాటల్లేవ్... సినిమా మొత్తం పాటలే - విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ రోల్!
మీరు ఓకే అంటే నా జర్నీ స్టార్ట్‌చేస్తా.. పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన
ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
తాజావార్తలు
- ●Cockroach Janta Party | "ఏ ఒక్కరినీ వదిలిపెట్టం": అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!
- ●TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
- ●South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా
- ●Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?
- ●Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
- ●Horoscope | జూలై 28 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు..!

Cockroach Janta Party | "ఏ ఒక్కరినీ వదిలిపెట్టం": అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!

TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు

South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా

Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?






