త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhruv Rathee | యూట్యూబ‌ర్ ధృవ్ రాఠేపై బెయిల‌బుల్ వారెంట్‌

Dhruv Rathee | 2018 ప‌రువున‌ష్టం కేసు (Defamation Case)లో ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ (YouTuber) ధృవ్ రాఠే (Dhruv Rathee)పై ఢిల్లీ కోర్టు (Delhi court) షాకిచ్చింది. ఆయ‌న‌పై బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల‌తో ధృవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంది.

D

National | Published On Oct 17, 2026, 4.31 pm IST

Dhruv Rathee | యూట్యూబ‌ర్ ధృవ్ రాఠేపై బెయిల‌బుల్ వారెంట్‌
Advertisement

Dhruv Rathee | త్రినేత్ర న్యూస్ : ప‌రువున‌ష్టం కేసు (Defamation Case)లో ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ (YouTuber) ధృవ్ రాఠే (Dhruv Rathee)పై ఢిల్లీ కోర్టు (Delhi court) బెయిల‌బుల్ వారెంట్ (Bailable Warrants) జారీ చేసింది. 2018 ధృవ్ రాఠే తన యూట్యూబ్ ఛానెల్‌లో బీజేపీ ఐటీ సెల్ పార్ట్ 2 అంటూ ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోలో బీజేపీ ఐటీ సెల్ సభ్యులు ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడానికి, తనను కించపరచడానికి ఒక వ్యక్తికి రూ.50 లక్షల లంచం ఆఫర్ చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేశారని బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు వికాస్ పాండే కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.

ఈ కేసుకు సంబంధించి ధృవ్ రాఠేకి అధికారులు ప‌లు మార్లు నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఆయ‌న విదేశాల్లో ఉండ‌టంతో స‌మ‌న్లు ఆయ‌న‌కు అంద‌లేదు. ప్ర‌స్తుతం కాక్రోచ్ జ‌న‌తాపార్టీ నిర‌స‌న‌ల్లో పాల్గొనేందుకు ఆయ‌న భార‌త్‌కు రావ‌డంతో పిటిష‌న‌ర్లు కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో కోర్టు ఆదేశాల‌తో అధికారులు ధృవ్‌కు నోటీసులు అందించేందుకు వెళ్లారు. అక్టోబర్ 12న గురుగ్రామ్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, ఇంటికి తాళం వేసి ఉండ‌టంతో సమన్లు అందించేందుకు వీలుకాలేదు. ఈ విష‌యాన్ని అధికారులు కోర్టుకు తెలియ‌జేశారు. దీంతో జ్యుడీషియ‌ల్ మెజిస్ట్రేట్ రాహుల్ జైన్.. ధృవ్‌పై బెయిల‌బుల్ వారెంట్ జారీ చేశారు. అనంత‌రం కేసు తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల‌తో ధృవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంది. అయితే, బెయిల‌బుల్ వారెంట్ కావ‌డంతో ఆయ‌న‌కు బెయిల్ వ‌చ్చే అవకాశాలున్నాయి.

Also Read..

దేశంలో స్వదేశీ ఉగ్ర‌వాదం దాదాపు అంత‌మైపోయింది : హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్

ముంబ‌యి ఇండియన్స్ కోచ్ ప‌ద‌వికి జయవర్ధనే గుడ్‌బై

ప్ర‌యాణికుల ర‌ద్దీని బ‌ట్టి అద‌న‌పు బ‌స్సులు

Advertisement
Advertisement