త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Divorce | భార్య‌తో విడాకులు.. ప‌సుపు, పాలు, కొబ్బ‌రినీళ్ల‌తో తండ్రీకూతురు స్నానం

Divorce | విడాకులు తీసుకోవ‌డానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు.. కార‌కులు ఎవ‌రైనా ఉండొచ్చు. కానీ ఆ విడాకులు పొందిన త‌ర్వాత ఒక‌రు సంతోషిస్తే.. మ‌రొక‌రు బాధ‌ప‌డుతారు. ఇక ఆ దంప‌తుల దాంప‌త్య జీవితం ముగిసి.. మ‌రో కొత్త జీవితానికి అడుగులు వేస్తుంటారు. పాత జ్ఞాప‌కాలు మ‌దిలో మెద‌లాడుతున్న‌ప్ప‌టికీ, మ‌న‌సు నిబ్బ‌రం చేసుకుని జీవ‌నం సాగిస్తుంటారు.

S

Popular news | Published On Sep 25, 2026, 4.15 pm IST

Divorce | భార్య‌తో విడాకులు.. ప‌సుపు, పాలు, కొబ్బ‌రినీళ్ల‌తో తండ్రీకూతురు స్నానం
Advertisement

Divorce | త్రినేత్ర న్యూస్ : విడాకులు తీసుకోవ‌డానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు.. కార‌కులు ఎవ‌రైనా ఉండొచ్చు. కానీ ఆ విడాకులు పొందిన త‌ర్వాత ఒక‌రు సంతోషిస్తే.. మ‌రొక‌రు బాధ‌ప‌డుతారు. ఇక ఆ దంప‌తుల దాంప‌త్య జీవితం ముగిసి.. మ‌రో కొత్త జీవితానికి అడుగులు వేస్తుంటారు. పాత జ్ఞాప‌కాలు మ‌దిలో మెద‌లాడుతున్న‌ప్ప‌టికీ, మ‌న‌సు నిబ్బ‌రం చేసుకుని జీవ‌నం సాగిస్తుంటారు. ఇంత వ‌ర‌కు ఒకే.

కానీ ఈయ‌న మాత్రం ఓ అడుగు ముందుకేశాడు. త‌న భార్య‌తో విడాకులు పొందిన మ‌రుక్ష‌ణ‌మే ఉప్పొంగిపోయాడు.. ఆయ‌న సంతోషానికి అవ‌ధుల్లేకుండా పోయింది. త‌న బిడ్డ‌తో క‌లిసి పాలు, ప‌సుపు, కొబ్బ‌రి నీళ్ల‌తో క‌లిసి స్నానం చేశాడు. ఈ మూడు నీళ్ల‌తో స్నానం చేస్తూ బిడ్డ కూడా సంతోషించింది. తండ్రీకూతుళ్ల సంతోషాన్ని చూస్తే.. భార్య ఎంత న‌ర‌కం చూపించిందో అర్థ‌మ‌వుతుంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

అయితే ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగింది..? ఏ కోర్టు విడాకులు మంజూరు చేసింది. బాధితుల వివ‌రాలేవి తెలియ‌రాలేదు.

Advertisement
Advertisement