త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | మోదీ గారూ మ‌ణిపూర్‌నూ విజిట్ చేయండి.. అస్సాం ప‌ర్య‌ట‌న వేళ ప్ర‌ధానికి ఫ్లైట్ టికెట్ బుక్‌చేసిన కాంగ్రెస్‌

PM Modi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఇవాళ ఈశాన్య రాష్ట్రం అస్సాం (Assam)లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాని అస్సాం ప‌ర్య‌ట‌న వేళ ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ (Congress) పార్టీ మ‌ణిపూర్ (Manipur) అంశాన్ని తెర‌పైకి తెచ్చింది.

D

National | Published On Feb 14, 2026, 1.44 pm IST

PM Modi | మోదీ గారూ మ‌ణిపూర్‌నూ విజిట్ చేయండి.. అస్సాం ప‌ర్య‌ట‌న వేళ ప్ర‌ధానికి ఫ్లైట్ టికెట్ బుక్‌చేసిన కాంగ్రెస్‌
Advertisement

PM Modi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఇవాళ ఈశాన్య రాష్ట్రం అస్సాం (Assam)లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాని అస్సాం ప‌ర్య‌ట‌న వేళ ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ (Congress) పార్టీ మ‌ణిపూర్ (Manipur) అంశాన్ని తెర‌పైకి తెచ్చింది. మ‌ణిపూర్ రాష్ట్రం ఇప్ప‌టికీ మండుతోంద‌ని.. అస్సాం వ‌ర‌కూ వెళ్లిన ప్ర‌ధాని అట్నుంచి హింసాకాండకు గురైన‌ రాష్ట్రానికి కూడా వెళ్లాల‌ని సూచించింది. అస్సాం నుంచి మ‌ణిపూర్‌కు కేవ‌లం గంట మాత్ర‌మే స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొంది. ప్ర‌ధాని మ‌ణిపూర్ వెళ్లేందుకు టికెట్ కూడా బుక్ చేసిన‌ట్లు పేర్కొంది (Congress books PMs flight ticket). ఈ మేర‌కు కాంగ్రెస్ నేత ప‌వ‌న్ ఖేరా ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

“ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల‌కు వెళ్లేందుకే మీరు ప్రాధాన్య‌త ఇస్తారు. అయినా మ‌ణిపూర్‌ని మాత్రం వ‌దిలేయ‌కూడ‌దు. 2023 నుంచి ఆ రాష్ట్రం మండుతూనే ఉంది. ఇప్పుడు మ‌రోసారి ఉద్రిక్త‌త‌లు పెరిగాయి. మీరు ఇప్పుడు అస్సాంలోనే ఉన్నారు. అక్క‌డి నుంచి మ‌ణిపూర్‌కు కేవ‌లం గంట స‌మ‌యం మాత్ర‌మే ప‌డుతుంది. ద‌య‌చేసిన అక్క‌డికి కూడా వెళ్లండి. మ‌ణిపూర్ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇవ్వండి. మీకోసం గువాహ‌టి ఎయిర్‌పోర్టు నుంచి ఇంఫాల్‌కు విమాన టికెట్ కూడా బుక్ చేశాం. మీ ఫోన్ నంబ‌ర్ నా ద‌గ్గ‌ర లేక‌పోవ‌డంతో విమాన టికెట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నాను. ద‌య‌చేసిన దాన్ని ఉప‌యోగించుకోండి” అంటూ వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. ప్ర‌స్తుతం ఈ పోస్టు వైర‌ల్ అవుతోంది. దీనిపై బీజేపీ నేత‌లు కాంగ్రెస్ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

https://x.com/Pawankhera/status/2022526137411190880

చిన్న రాష్ట్రమైన మణిపుర్‌లో రెండు గ్రూపులైన మెజార్టీ మెయితెయ్ (Meitei Community), మైనార్టీ కుకీ తెగల (Kuki-Zo community) మధ్య భూమి, పలుకుబడి విషయంలో నెలకొన్న వివాదం జాతుల మధ్య ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. అదికాస్తా హింసాత్మ‌కంగా మార‌డంతో రాష్ట్రాన్ని తీవ్ర అంతర్యుద్ధంలోకి నెట్టేసింది. 2023 మే3న మైతేయీ, కుకీ తెగల మధ్య ప్రారంభ‌మైన‌ హింస దీర్ఘకాలంపాటు కొన‌సాగింది. ఈ అల్ల‌ర్ల‌లో దాదాపు 300 మంది వ‌ర‌కూ ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అంచ‌నా. వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ఈ ఘర్షణల అనంత‌రం దాదాపు రెండేళ్ల త‌ర్వాత అంటే గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో ప్ర‌ధాని మ‌ణిపూర్‌లో ప‌ర్య‌టించారు. బాధిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.

Advertisement
Advertisement