Sukhoi Su-57 jet | సుఖోయ్ ఎస్‌యూ-57 తయారుచేద్దాం.. భారత్‌కు పుతిన్ కీలక ప్రతిపాదన
Sukhoi Su-57 jet | అధునాతన ఐదో తరం యుద్ధ విమానాల (5th-generation stealth fighter jets) తయారీపై భారత్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ ఆఫర్ ప్రకటించారు. సుఖోయ్ ఎస్‌యూ-57 (Sukhoi Su-57 jet) యుద్ధవిమానాలను భారత్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
Sukhoi Su-57 jet | భారత వైమానిక దళ సామర్థ్యాలను మరింత పెంచే లక్ష్యంతో ఐదో తరం యుద్ధ విమానాల (5th-generation stealth fighter jets)సమీకరణకు భారత్ ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి కీలక ప్రతిపాదన వచ్చింది. అధునాతన స్టెల్త్ సాంకేతికతతో కూడిన సుఖోయ్ ఎస్‌యూ-57 (Sukhoi Su-57 jet) యుద్ధవిమానాలను భారత్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప్రకటించారు.
అంతేకాదు, ఈ ప్రాజెక్టుకు అవసరమైన కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌తో పంచుకునేందుకు కూడా రష్యా ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో విలేకరులతో మాట్లాడుతూ పుతిన్ ఈ కీలక ప్రతిపాదన చేశారు. రక్షణ రంగంలో సహకారానికి ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిమితులు లేవని రష్యా అధ్యక్షుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భారత్‌తో రక్షణ రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు.
భారత్‌కు సుఖోయ్-57 (Su-57) ఫైటర్ జెట్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసే అవకాశాన్ని గతంలోనే కల్పించినట్లు పుతిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2018లో 'ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్' (FGFA) ప్రాజెక్ట్‌తో ముందుకొచ్చినట్లు చెప్పారు. అయితే, ఈ ప్రాజెక్టు నుంచి భారత్ అప్పట్లో వెనక్కి తగ్గిందని ఈ సందర్భంగా పుతిన్ వివరించారు.
కాగా, ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద ఎలాంటి ఐదో తరం ఫైటర్ జెట్‌లు లేవు. పొరుగు దేశాలతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐదో తరం యుద్ధ విమానాలను వాయుసేనలోకి చేర్చాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది. దాయాది పాకిస్థాన్ త్వరలోనే చైనా నుంచి ‘షెన్యాంగ్ J-35AE’ (Shenyang J-35AE) స్టెల్త్ ఫైటర్లను కొనుగోలు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య రష్యా నుంచి ఈ ఆఫర్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు భారతదేశం స్వదేశీ సాంకేతికతతో ఐదో తరం జెట్‌ను అభివృద్ధి చేయడానికి చేపట్టిన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇది 2030 మధ్య నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read..
మోదీ నాకు గుడ్ ఫ్రెండ్.. భారత్‌తో త్వరలోనే బిగ్ డీల్ : ట్రంప్
బీఆర్ఎస్ మాట్లాడడం ప్రాజెక్టును బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉంది: సామ రామ్మోహన్ రెడ్డి
రామ్‌చరణ్ పెద్ది ఫస్ట్ డే కలెక్షన్స్ - దేవర , పుష్ప 2 కంటే తక్కువే
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Cabinet Decisions | రూ. 9,450 కోట్ల భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. ఏపీకి దక్కిన ప్రాధాన్యం
ఆగస్టు 19, 2026

Telangana BJP | బండి అవుట్.. ఈటల, అరుణ ఇన్
ఆగస్టు 18, 2026

Rahul Gandhi | తప్పులు ఎన్టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
- ●Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్
- ●Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్
- ●SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్

Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్

SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..



