CM Revanth Reddy | తిన్నది అరిగేదాక తిరిగండి.. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ సెటైర్లు
CM Revanth Reddy | తిన్నది అరిగేదాక తిరగండి.. కాశీ దాకా నడవండి నీసం చేసిన పాపాలైన పోతయ్ అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాగ్భానాలు సందించారు. 'కరివెన రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
CM Revanth Reddy | తిన్నది అరిగేదాక తిరగండి.. కాశీ దాకా నడవండి నీసం చేసిన పాపాలైన పోతయ్ అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాగ్భానాలు సందించారు. 'కరివెన రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక.. ఈ జిల్లా నుంచే ఎన్నికవడమే కాదు ఈ జిల్లాలోనే పుట్టి, పెరిగి, ఈ ప్రాంత పరిస్థితులపై అవగాహన ఉండి.. 17 సంవత్సరాలు ప్రతిపక్షంలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పార్టీ నాయకుడిగా జిల్లా నలుమూల తిరిగిన నేను ఈ ప్రాజెక్టులను ఒ కొలిక్కి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న. ఏది ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు సరి చూసుకునేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది' అని తెలిపారు.
రాజకీయ కార్యాచరణ పేరుతో మళ్లీ బయలుదేరారు..
'ఈ రోజు వాటన్నింటిని కొలిక్కి తెచ్చి ముందుకు తీసుకెళ్దామంటే.. ఓహో పని చేసేటట్టున్నడు.. కొలిక్కి వచ్చేటట్టు కాబట్టి.. మేమేదో రాజకీయ కార్యాచరణ తీసుకుంటమని బయలుదేరారు. తప్పులేదు. తిన్నదన్నా అరుగతది తిరగండి, నడవండి. చేసిన పాపాలైనా కొంచెమన్నా పోతయ్. కాశీ వరకు నడవండి ఇంకా మంచిది. మీరు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు. మీరు పాపాలు చేసేడే కాదు.. ఆయన ఆయన చేస్తుంటే చూడడం మహాపాపం. ఒకాయన గోసిగట్టుకొని రాజరెడ్డి అనుకుంటడు గట్లవెంబడి తిరిగి. గోసి కట్టుకున్నోళ్లంతా రాజశేఖర్‌రెడ్డి అయితే బాగానే ఉండు. ఇంకొకాయన ఇంటిపేరు మార్చుకున్నడు. అసలు ఏమాత్రం ప్రజలు ఏమనుకుంటరు? ఇలా వ్యవహరిస్తే చీదరించుకుంటరా? లేదా అన్న సోయికూడా లేకుండా మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తన్నరు' అంటూ విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్.
కేసీఆర్ అప్పుల భారం మోయలేనంతగా మారింది..
'ఈ రోజు కొన్ని వివరాలు చెప్పదలచుకున్న. ఖర్చులు కాదు. జరిగిన అప్పుల్లో, బ్యాంకుల్లో తెచ్చిన అప్పులకు చంద్రశేఖర్‌రావు రూ.41,118కోట్లు బ్యాంకులకు అసలు కట్టిండు. మిత్తి రూ.43,385 కోట్లు కట్టిండు. చంద్రశేఖర్‌రావు పదేళ్లల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు రూ.84,503కోట్లు కట్టిండు. నేను వచ్చాక ఆయన చేసిన అప్పుల భారం మోయలేనంతగా మారి.. కరెక్టు 30 నెల్లల్లో రూ.33,567కోట్ల అసలు, రూ.18,554కోట్ల మిత్తి కట్టిన. 30నెలల్లో పాపాల బైరవుడు నాకు అందించిన ఈ అప్పు రూ.52,120 ఈ నెల వరకు కట్టాను. పనులకు ఈ 30 నెలల్లో చెల్లించింది ఎంత అంటే.. రూ.22వేలకోట్లు. ఆయన చేసిన అప్పులకు రూ.52వేలకోట్లు వడ్డీలు, అసలు కడితే.. నేను రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టులకు 30 నెలల్లో రూ.22వేలకోట్లు. రాష్ట్రం అంతా చెల్లిస్తే పాలమూరు జిల్లాలోనే రూ.8వేలకోట్లు చెల్లించాను. నేను పాలమూరు జిల్లాకు అధికంగా నిధులు ఇచ్చినట్లా? అన్యాయం చేసినట్లా?' అంటూ ప్రశ్నించారు.
4వేల ఎకరాల భూసేకరణ చేయాలి..
'ఇప్పటికీ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 4వేల ఎకరాల భూసేకరణ చేయాలి. భూసేకరణ చేయకుండా కాంట్రాక్టర్లకు ఎన్ని పైసలు ఇచ్చినా.. కాలువ ఐదుకిలోమీటర్లు తొలువాలంటే.. కిలోమీటరు భూసేకరణ చేసి.. అరకిలోమీటర్ వదిలి.. మరో అరకిలోమీటర్ భూసేకరణ చేసి వదిలితే నీళ్లు పారుతయా? కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకుంటే రిజర్వాయర్లలో నీళ్లు వస్తాయా? మేయిన్ లైన్ కెనాల్స్‌కు భూసేకరణ చేయలేదు. రిజర్వాయర్లలో సమస్యలు అలాగే ఉన్నాయ్. ఉద్దండాపూర్‌లో ఆర్ అండ్ ఆర్ సమస్య ఉంటే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నం. ఇవేవీ చేయకుండా, భూసేకరణ చేయకుండా, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నీళ్లు నింపగలమా? అందుకే ఈ రోజు ఆ సమస్యలన్నింటిని సంపూర్ణమైన అవగాహన చేసుకొని.. రాబోయే రెండేళ్లలో ఈ జిల్లాలో పనులన్నీ పూర్తి చేయాలని కంకణం కట్టుకొని మేం అందరం క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యాచరణతో ముందుకెళ్తున్నాం' అని సీఎం తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది..
'ప్రతి ఆరునెలలకోసారి ఒక షెడ్యూల్ చేసుకొని.. డిసెంబర్ వరకు ఏం పూర్తి చేయగలం? మళ్లీ జూన్ వరకు ఏం చేయగలం.. విడుదలవారీగా ప్రణాళికబద్ధంగా పనులు ఏ విధంగా చేయాలని అధికారులకు టార్గెట్ ఇచ్చి.. భూసేకరణకు కలెక్టర్లకు టార్గెట్ ఇచ్చి.. అవసరమైన నిధులు ఎలా సేకరించాలి. విపరీతమైన అప్పులు తేవడం వల్ల నిజంగా అవసరం ఉన్నప్పుడు అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. నోరు తెరిస్తే తప్పుడు ప్రచారం, అబద్ధాలే. నిన్నామొన్న 90శాతం పాలమూరు పూర్తయ్యిందని చెప్పిన్రు. 90శాతం పనులు పూర్తయితే.. వాళ్ల అంచనాలు, జీవో ప్రకారమే రూ.55వేలకోట్లు పాలమూరు-రంగారెడ్డికి అవసరం కదా? వాళ్ల హయాంలో ఖర్చు చేసిందే రూ.27వేల కోట్లు. వాళ్ల ఆ రోజు చేసిన అంచనా రూ.55వేలకోట్లు. ఇప్పుడు ఎంతవుతుందో అంచనా వేయలేదు. ధరలు పెరిగినయ్' అని తెలిపారు.
90శాతం పనులెలా పూర్తవుతయ్..
'50శాతం నిధులు ఖర్చు చేయకుండానే 90శాతం పనులు ఎలా పూర్తవుతయ్. అంచనాలన్నా అబద్ధమైనా ఉండాలి. పని చేయకుండా అబద్ధాలైనా చెప్పాలి. రెండింటికి పొంత ఉండాలి. రూ.55వేలకోట్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి అవుతుందనుకున్నప్పుడు రూ.27వేలకోట్లతో 47-48శాతం నిధులు ఖర్చు చేస్తే 90శాతం పనులు ఎలా పూర్తవుతయ్? ఆ సైన్స్, మాథ్య్స్ నాకు అర్థవడం లేదు. నేను 80వేల పుస్తకాలు చదవలేదు. లాజిక్ దొరకడం లేదు. రూ.27వేలకోట్లలో ఎక్కువ పంపులు, లిఫ్టులకు పోయినయ్. ఎందుకు ఎలక్ట్రో ఎక్విప్‌మెంట్ కొన్నడంటే 20-40శాతం కమీషన్లు కొట్టడానికి అడ్డగోలు రేట్లు పెంచి ఆ పైసలు ఇచ్చిండు. సివిల్ వర్కులకు ఇవ్వలేదు. భూసేకరణకు ఇవ్వలేదు. ఈ రోజు ఆయన ఎట్ల పడితే అట్ల చేసి.. ఏదిపడితే అది మాట్లాడి ఉన్నదంతా ఊడ్చుకుపోయి, దోచుకుపోయి మమ్మల్ని ఏదో దోషులుగా నిలబెడుతున్నమని భ్రమల్లో ఉన్నరు. ఎవరూ అంత అమాయకులు లేరు. ఊరికావూరికి తెలుసు ఏం పనులవుతున్నయో. ఇప్పుడు కొల్లాపూర్ పోయినమ్. చిన్నపిల్లాడిని అడిగినా చెబుతున్నడు ఏం జరిగిందో. వనపర్తి ఏరియాకు వెళ్లాం. నాగర్ కర్నూల్ ఏరియా, దేవరకద్ర ప్రాంతానికి వచ్చాం. రేపు జడ్చర్లకు వెళ్తాం. లోకల్‌లో ఉన్న వారికి ఈయన ఏం చేసిండు. ఏం చేయలేదు. నిధులు ఇచ్చిండా? ఇవ్వలేదా అని తెలుసు'నని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి
జూన్ 5, 2026

Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది
జూన్ 5, 2026

Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు.. మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●Nivetha Pethuraj | ఐటెంసాంగ్‌కు టాలీవుడ్ హీరోయిన్ సై
- ●Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది
- ●Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు.. మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్
- ●Krithi Shetty | టాలీవుడ్లోకి కృతి శెట్టి కమ్ బ్యాక్ - రొమాంటిక్ సీన్లతో షూటింగ్ షురూ
- ●KCR | రెండేళ్లు సహకరించండి.. పాలమూరు బీఆర్ఎస్ నేతలకు సీఎం రిక్వెస్ట్..!
- ●TATA EV | టాటా ఈవీలపై భారీ రాయితీలు.. రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్లు..

Nivetha Pethuraj | ఐటెంసాంగ్‌కు టాలీవుడ్ హీరోయిన్ సై

Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది

Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు.. మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్

Krithi Shetty | టాలీవుడ్లోకి కృతి శెట్టి కమ్ బ్యాక్ - రొమాంటిక్ సీన్లతో షూటింగ్ షురూ



