CM Revanth Reddy | భూసేకరణ జరుగకుండా ప్రాజెక్టు పూర్తవుతుందని కేసీఆర్ ఎట్ల అనుకున్నరు? ప్రశ్నించిన సీఎం రేవంత్
CM Revanth Reddy | భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు పూర్తవుతాయవుతయని కేసీఆర్ ఎలా భావించారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం రెండురోజుల పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూర్‌లో కరివెన రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
CM Revanth Reddy | భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు పూర్తవుతాయవుతయని కేసీఆర్ ఎలా భావించారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం రెండురోజుల పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూర్‌లో కరివెన రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'పాలమూరు జిల్లా సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించి జరుగుతున్న పనులను పరిశీలించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల్లో చాలామంది ఇక్కడ ఉన్నారు. 2009లో కేసీఆర్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తాను ఇక్కడి నుంచి ఈ ప్రాంత సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాకు సహాయం అందుతుంది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆకాంక్షించింది. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే మన్మోహన్‌సింగ్, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ శాసనసభకు మన జిల్లా నుంచి పోటీ చేయలేదు' అని సీఎం అన్నారు.
మహబూబ్‌నగర్‌కే సహాయం అందాల్సి ఉండే..
'ఆయనకు ఆయన జిల్లాపై మమకారంతోనో, ఇతర కారణాలతోనే గజ్వెల్ నుంచి ప్రాతినిథ్యం వహించినా.. కష్టకాలంలో సహాయం అందించి, అక్కున చేర్చుకొని, పాలమూరులో ఊరులేకపోయినా పార్లమెంట్‌కు పంపించిన ప్రజలకు తన సహాయాన్ని, ఆలోచనను అందించి వలసల జిల్లాల అభివృద్ధి జిల్లాల అభివృద్ధి జిల్లాగా మారుస్తారని ఆశించడంలో తప్పులేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైన మహబూబ్‌నగర్ జిల్లాకే ఆనాడు సహాయం అందాల్సి ఉండే. మిగతా జిల్లాల కంటే అన్ని విషయాల్లో విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు విషయంలో, కృష్టానదీ మన జిల్లాలోనే ప్రవహించినా ఆ నీటిని మనం ఒడిసిపట్టుకున్న సందర్భమే లేదు. కాబట్టి ఈ ప్రజలు అందించిన సహాయాన్ని గుర్తు పెట్టుకొని చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యేక కార్యాచరణతో ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారని ఆశించాం' అన్నారు.
మభ్యపెట్టే ప్రయత్నం చేశారు..
'పదేపదే చిన్నారెడ్డి నుంచి మేం అందరం చాలా సందర్భాల్లో చట్టసభల్లో, బహిరంగంగా ఆయనను ప్రశ్నించడం జరిగింది. వారిలో మార్పు రాలేదు కానీ.. అబద్ధపు ప్రచారాలతో ఈ జిల్లాను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. స్థూలంగా రెండుమూడు విషయాలతో కేసీఆర్ పదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.1.81లక్షల కోట్లు పనులపై ఖర్చు చేశారు. ఇందులో రూ.లక్ష కోట్లు కాళేశ్వరం, గోదావరిపైనే ఖర్చు చేశారు. మిగతా డబ్బుల్లో కొన్ని ప్రాజెక్టుల కోసం పాలమూరులో ఖర్చుచేశారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అత్యంత కీలకమైన పథకం. ఎందుకంటే కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, మనం ప్రారంభించుకున్న మక్తల్-నారాయణపేట్-కొండంగల్ ఎత్తిపోతల అన్ని కలిపినా పాలమూరు-రంగారెడ్డితో సమానం కాదు. ఈ ఒక్క పథకమే 90 టీఎంసీల నీళ్లు. ఈ రోజు ఈ జిల్లాలో జూరాల నుంచి మొదలుపెడితే బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, మిగతా ప్రాజెక్టులు కట్టి పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేస్తే ఈ జిల్లాకు దాదాపుగా 26లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందే అవకాశం ఉండే' రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
26లక్షల ఎకరాలకు సాగునీరందేది..
'నిజంగా పదేళ్ల సుదీర్ఘకాలంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో నికరంగా 26లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. సాగునీరుతో పాటు పరిశ్రమల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకే రూ.27వేలకోట్ల ఆనాటి ప్రభుత్వం, కేసీఆర్ ఖర్చు చేశారు. మీరు అడగొచ్చు. రూ.27వేలకోట్లు పెద్దెత్తున ఖర్చు చేసిండు మంచిపని చేసిండని మీరు అనొచ్చు. ఆ ఖర్చు పెట్టింది పంపులు, లిఫ్ట్‌లు. అందులో ఖర్చు పెడితే కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది కాబట్టి. రూ.27కోట్లలో పంపులు, లిఫ్టులకే ఇచ్చి.. వేలకోట్ల కమీషన్లు కొల్లగొట్టి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకుండా ఎక్కడదక్క వదిలేసిపోయిండు. భూసేకరణ కూడా చేయలేదు. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా.. పూర్తి చేయాలన్నా మొదట భూసేకరణ అవసరం' అన్నారు.
నగదు కొట్టేసేందుకే..
'ఈ నాటికి నాకు అధికారులు అందించిన సమాచారం మేరకు ఈ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నయ్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసిన జూరాల ప్రాజెక్టును వదిలేస్తే.. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల గానీ ఏ ప్రాజెక్టు తీసుకున్నా పనులు పూర్తి సంగతి దేవెడెరుగు. ప్రాజెక్టులు నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ కూడా జరుగలేదు. భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు పూర్తవుతాయవుతయని కేసీఆర్ ఎట్ల భావించారని నేను అడుగుతున్న. ఆయన ఆలోచన ఎంతసేపు పంపులు, లిఫ్ట్‌లు, కాంట్రాక్టర్ల వేలకోట్ల బిల్లులు చెల్లించుడు. అందులో నుంచి నగదు కొట్టేసుడు. నాగం జనార్దన్‌రెడ్డి కొట్లాడి కొట్లాడి అలసిపోయి ఆయనతోనే చేరే పరిస్థితి వచ్చింది. ఏమాటకాటమాట నాగం జనార్దన్‌రెడ్డి ఈ పంపుల్లో, లిఫ్టుల్లో జరిగిన అవినీతిపై సంవత్సరాల కొద్ది కొట్లాడారు. సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది' అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nivetha Pethuraj | ఐటెంసాంగ్‌కు టాలీవుడ్ హీరోయిన్ సై
- ●Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది
- ●Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు.. మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్
- ●Krithi Shetty | టాలీవుడ్లోకి కృతి శెట్టి కమ్ బ్యాక్ - రొమాంటిక్ సీన్లతో షూటింగ్ షురూ
- ●KCR | రెండేళ్లు సహకరించండి.. పాలమూరు బీఆర్ఎస్ నేతలకు సీఎం రిక్వెస్ట్..!
- ●TATA EV | టాటా ఈవీలపై భారీ రాయితీలు.. రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్లు..

Nivetha Pethuraj | ఐటెంసాంగ్‌కు టాలీవుడ్ హీరోయిన్ సై

Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది

Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు.. మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్

Krithi Shetty | టాలీవుడ్లోకి కృతి శెట్టి కమ్ బ్యాక్ - రొమాంటిక్ సీన్లతో షూటింగ్ షురూ





