KCR | రెండేళ్లు సహకరించండి.. పాలమూరు బీఆర్ఎస్ నేతలకు సీఎం రిక్వెస్ట్..!
KCR | కేసీఆర్‌కు ఊడిగం చేయడం ఆపాలని.. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రెండేళ్లు ప్రభుత్వానికి ఆటంకాలు కలిగించొద్దంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరివెన రిజర్వాయర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. 'పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ఏర్పాటు చేయడానికి, సేకరించేందుకు పక్కా కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నామన్నారు.
KCR | కేసీఆర్‌కు ఊడిగం చేయడం ఆపాలని.. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రెండేళ్లు ప్రభుత్వానికి ఆటంకాలు కలిగించొద్దంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరివెన రిజర్వాయర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. 'పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ఏర్పాటు చేయడానికి, సేకరించేందుకు పక్కా కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాం. ఎక్కడైనా అధికారులు ఏదైనా విషయాల్లో అటుఇటుగా చెబితే అర్థం చేసుకునేందుకు ప్రతీది తిరిగి చూసుకుంటూ వచ్చి ఈ జిల్లాకు 26లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి, నిధులు, సంపూర్ణంగా సమకూర్చడానికే ఈ రెండు రోజులు తిరిగాం. రాబోయే రోజుల్లో ఇంకా వేగంగా భూసేకరణ, పనులు చేస్తాం. అవసరమైన నిధులు విడుదల చేస్తాం. భూసేకరణ విషయంలో మీడియా సహకరించాలి' అని విజ్ఞప్తి చేశారు.
మొదటి ప్రాధాన్యం భూసేకరణకే..
'భూసేకరణ జరుగకుండా ఈ పనులు పూర్తికావు. భూసేకరణకు రూపాయి ఎక్కువైనా ఇచ్చి వాళ్ల సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నాం. అందుకే నిన్నామొన్న మొదటి ప్రాధాన్యత కింద భూసేకరణకే నిధులన్నీ విడుదల చేస్తున్నాం. ఇంకా 4వేల ఎకరాల భూసేకరణకు మీడియా మిత్రులు సహకరించాలి. ఈ రోజులు ఈ పనులు చేయకపోతే.. ఇంకా ఎప్పుడు చేయలేం. ఈ రోజు మనచేతుల్లోనే అధికారం ఉండి, మనమే నిర్ణయాలు తీసుకోగలిగి ఉండి.. మనమే నిధులు తెచ్చుకోగలిగి ఉండి.. పనులు పూర్తి చేసుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. నేను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నా. ఈ జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా నీళ్లు నింపేందుకు రిజర్వాయర్లు ఉండాలి. జూరాల 17.84 టీఎంసీల కెపాసిటీతో నిర్మిస్తే ఇవాళ నీటి నిల్వ 9 టీఎంసీలు. మనం ఆ పక్కన గూడెందొడ్డిలో 15 టీఎంసీలు రిజర్వాయర్‌లో నీళ్లు నింపుకుంటే.. జూరాలలో నీరులేనప్పుడు దాని కింద అవసరమైతే నీరు విడుదల చేసేందుకు అవకాశం ఉంది. తుమ్మిళ్లలో రిజర్వాయర్ లేదు. రాబోయే రోజుల్లో ఎక్కడ అవకాశం ఉన్నా.. తక్కువ భూసేకరణ, ఎక్కువ నీరు నిల్వ చేసేందుకు అవకాశం ఉందో ఆ పనులు చేస్తాం' అని వివరించారు.
కర్నాటక తరహాలో బ్రిడ్జి కం బ్యారేజీలు..
'కర్నాటక బ్రిడ్జి కం బ్యారేజీలు వంద టీఎంసీలు నీరు నిల్వ చేసే పరిస్థితి వచ్చింది. కర్నాటక మంత్రితో కలిసి సరిహద్దులో బ్రిడ్జి కం బ్యారేజీలు కట్టుకుంటే నీళ్లు నింపుకోవడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతయ్. అత్యవసర సమయాల్లో మనం కర్నాటకు అడుక్కోవాల్సి వస్తుంది. అందుకే బ్రిడ్జి కం బ్యారేజీలపై అధ్యయనం చేస్తున్నం. త్వరలోనే సాంకేతిక నిపుణులతో చర్చిస్తాం. కర్నాటకలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అక్కడి ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలను కూడా వాడుకొని.. ఖర్చులు సగం సగం పెట్టుకొని.. నీరు మనం 60-70శాతం వాడుకునేటట్లు కార్యాచరణ తీసుకున్నం. ఆగిపోయిన రిజర్వాయర్లను పునరుద్ధరిస్తాం. ఆ రోజు అడ్డగోలు అంచనాలు వేసుకున్నరు. ఇవాళ పనుల పరిస్థితే మారిపోయింది' అని తెలిపారు.
మన జిల్లాను మనమే అభివృద్ధి చేసుకుందాం..
'వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అంచనాలు తయారు చేసి వీటన్నింటిని పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. మన జిల్లాను మనమే అభివృద్ధి చేసుకుందాం. ఇంతమంచి అవకాశం మనకు రాదు. మనకు ఎన్ని విభేదాలున్నా.. జిల్లా అభివృద్ధి విషయంలో ఒకటిగా ఉండాలి. బీఆర్ఎస్ నాయకులకు, నేతలమని చెప్పుకునేటోళ్లందరికీ ఆ సూచన ఒక్కటే.. మీరు ఏం చేయొద్దు. మాట్లాడకుంటే ఉంటే చాలు. కేసీఆర్‌కు ఊడిగం చేయడం ఆపండి. ఆఖరికి ఆరు నెలలకు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం ఎవరు ఎట్లుంటరో.. ఎవరు ఏమైతరో.. జిల్లా ఎవరి పక్షాన నిలుస్తుందో.. రైతులు, విద్యార్థులు, జిల్లా ఎవరికి అండగా ఉంటుందో ఆ రోజు తేల్చుకుందాం. రెండు సంవత్సరాలు మర్యాదగా ఉండడం నోర్చుకోండి. ఏదిపడితే అది మాట్లాడి పనులు, భూసేకరణ జరుగకుండా, కాళ్లల్లో కట్టే పనులు చేయకూడదని జిల్లా బీఆర్ఎస్ నేతలు చేయొద్దని వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా'నని సీఎం రేవంత్ అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
- ●Ponguleti Srinivas Reddy | కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి
- ●Nivetha Pethuraj | ఐటెంసాంగ్‌కు టాలీవుడ్ హీరోయిన్ సై
- ●Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది
- ●Nirajan Reddy | పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు.. మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్
- ●Krithi Shetty | టాలీవుడ్లోకి కృతి శెట్టి కమ్ బ్యాక్ - రొమాంటిక్ సీన్లతో షూటింగ్ షురూ

CM Revanth Reddy | కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Ponguleti Srinivas Reddy | కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి

Nivetha Pethuraj | ఐటెంసాంగ్‌కు టాలీవుడ్ హీరోయిన్ సై

Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది



