Sai Pallavi | ధనుష్ సినిమాలో సాయి పల్లవి షాకింగ్ రోల్ – లేడీ సింగంగా నాచురల్ బ్యూటీ
ఓ తమిళ సినిమా కోసం సాయిపల్లవి పోలీస్ యూనిఫామ్ వేయబోతున్నది. ధనుష్ హీరోగా అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో సాయిపల్లవి పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రీలీల మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On Jun 5, 2026, 4.01 pm IST
Sai Pallavi | కెరీర్ ఆరంభం నుంచి ట్రెడిషనల్ రోల్స్, పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది సాయిపల్లవి. ఈ నాచురల్ బ్యూటీ పేరు చెప్పగానే హెవీ ఎమోషనల్ సీన్లతో కూడిన సెంటిమెంట్ పాత్రలు గుర్తొస్తాయి. గత సినిమాలకు భిన్నంగా ఫస్ట్ టైమ్ యాక్షన్ రోల్ చేయబోతుంది. ఓ తమిళ సినిమాలో ఖాకీ యూనిఫామ్‌లో కనిపించబోతుంది సాయిపల్లవి.
ధనుష్ పాన్ ఇండియన్ మూవీ...
ధనుష్ హీరోగా అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తోన్నారు. మలయాళ నటుడు మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తోన్న 55వ మూవీ ఇది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది.
లేడీ సింగం...
ఈ తమిళ సినిమాలో సాయిపల్లవి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుందట. లేడీ సింగం తరహాలో పవర్‌ఫుల్‌గా ఆమె పాత్ర సాగుతుందని అంటున్నారు. రెగ్యులర్ హీరోయిన్‌లా కాకుండా యాక్షన్ ప్రధానంగా సాయిపల్లవి క్యారెక్టర్‌ను దర్శకుడు విభిన్నంగా రాసుకున్నారట. ఇప్పటివరకు సినిమాల్లో చూసిన సాయిపల్లవికి, ఇందులోని పాత్రకు ఏ మాత్రం సంబంధం ఉండదని అంటున్నారు. హీరో ధనుష్‌కు ధీటుగా నాచురల్ బ్యూటీకి ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు ఉంటాయని చెబుతున్నారు.
త్వరలో షూటింగ్...
కెరీర్‌లో తొలిసారి సాయిపల్లవి పోలీస్ పాత్రలో కనిపించడటంతో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో సాయిపల్లవి జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. పోలీస్ వ్యవస్థ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. అమరన్ తరహాలోనే యథార్థ ఘటనల ఆధారంగా రూపొందనున్నట్లు సమాచారం.
పరాశక్తి తర్వాత...
డీ 55 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. పరాశక్తి తర్వాత తమిళంలో శ్రీలీల చేయబోతున్న సెకండ్ మూవీ ఇది.
సంబంధిత వార్తలు

Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ – సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?
ఆగస్టు 20, 2026

Dhruv Vikram | అనుపమ పరమేశ్వరన్ ఆరోపణలపై ధ్రువ్ విక్రమ్ క్లారిటీ – విమర్శలు ఏం చేయలేవంటూ కామెంట్స్
ఆగస్టు 18, 2026

Nithya Menen | పదకొండేళ్ల తర్వాత హారర్ మూవీలో నిత్యామీనన్ – ప్రొడ్యూసర్‌గా తొలి అడుగు
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
- ●Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్
- ●Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్
- ●SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్

Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్

SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..



