Trichy East | టీవీకే బిగ్ ట్విస్ట్.. తిరుచ్చి ఈస్ట్ నుంచి రాఘవ లారెన్స్ పోటీ..?
Trichy East | విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ రాజీనామాతో ఖాళీ ఏర్పడిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి త్రిష పోటీ చేస్తుందంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరో ప్రముఖ నటుడి పేరు తెరపైకి వచ్చింది. రాఘవ లారెన్స్ (Raghava Lawrence) పేరు తిరుచ్చి ఈస్ట్ రేసులో బలంగా వినిపిస్తోంది.
Trichy East | తమిళనాడులో మరో ఆసక్తికర రాజకీయ చర్చ మొదలైంది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. తిరుచ్చి ఈస్ట్ (Trichy East), పెరంబూర్.. రెండు స్థానాల్లోనూ విజయ్ (Actor Vijay) గెలుపొందారు. ఆ తర్వాత తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకున్నారు. దీంతో అక్కడ ఎవరు పోటీ చేస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
తొలుత ప్రముఖ స్టార్ నటి త్రిష తిరుచ్చి నుంచి టీవీకే అభ్యర్థిగా (TVK ticket) పోటీ చేసే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ స్థానం నుంచి పోటీ చేసి త్రిష తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడుతుందంటూ తమిళ మీడియా, సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. అయితే, ప్రస్తుతం త్రిషకు బదులు మరో ప్రముఖ నటుడి పేరు తెరపైకి వచ్చింది. ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) పేరు తిరుచ్చి ఈస్ట్ రేసులో బలంగా వినిపిస్తోంది. ఆయన త్వరలోనే విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.
రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి ప్రవేశించే విషయమై తన గురువు, ప్రముఖ నటుడు రజనీకాంత్ సలహా తీసుకున్నట్లు కూడా సమాచారం. అయితే, ఈ విషయానికి సంబంధించి టీవీకే నుంచి కానీ, రాఘవ లారెన్స్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇక ఎన్నికల సమయంలో రాజకీయాల్లో ప్రముఖుల పేర్లు వినిపించడం సర్వసాధారణమే. అయితే, అనూహ్యంగా రాఘవ లారెన్స్ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. తిరుచ్చి ఈస్ట్ (Trichy East) ఉపఎన్నికకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఇంకా ఎంతమంది పేర్లు తెరపైకి వస్తాయో చూడాలి.
Also Read..
సుఖోయ్ ఎస్‌యూ-57 తయారుచేద్దాం.. భారత్‌కు పుతిన్ కీలక ప్రతిపాదన
ఆయుష్మాన్ కార్డుతో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం.. కార్డును ఎలా పొందాలి..
సంబంధిత వార్తలు

CM Vijay | విద్యార్థి నిరసనలపై విజయ్ సర్కార్ యూటర్న్.. వివాదాస్పద ఆదేశాలు రద్దు
ఆగస్టు 19, 2026

CM Vijay | కొత్త కారు, ఖర్చుల కోసం నెలకు రూ.లక్ష.. ఎమ్మెల్యేలపై సీఎం విజయ్ వరాల జల్లు
ఆగస్టు 19, 2026

CM Vijay-Trisha | సిగ్గులేని చర్య.. సీఎం విజయ్-త్రిషపై మురసోలి కామెంట్స్
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
- ●Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్
- ●Melanoma Cancer | చర్మ క్యాన్సర్కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్
- ●SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్

Melanoma Cancer | చర్మ క్యాన్సర్కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్

SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..



