Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్లలో రైళ్లు రద్దు
Trains Cancelled | దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు, ఉద్యోగులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దానికి అనుగుణంగా రైళ్లలో టికెట్లు బుక్‌చేసుకుంటారు. అలాంటి వారికి బిగ్ అలర్ట్. వచ్చే నెల 28 నుంచి పలు రైళ్లు రద్దు (Trains Cancelled) కానున్నాయి.
Trains Cancelled | త్రినేత్ర.న్యూస్: దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు, ఉద్యోగులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దానికి అనుగుణంగా రైళ్లలో టికెట్లు బుక్‌చేసుకుంటారు. అలాంటి వారికి బిగ్ అలర్ట్. వచ్చే నెల 28 నుంచి పలు రైళ్లు రద్దు (Trains Cancelled) కానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు వెల్లడించారు. దక్షిణ తూర్పు రైల్వే ఖరగ్‌పూర్ విభాగంలోని బాలేశ్వర్ స్టేషన్‌లో ఆధునీకరణ, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు వెళ్లడించారు.
మరమ్మతులు పూర్తయిన తర్వాత రైళ్లు ఎప్పటి నుంచి పునఃప్రారంభించేది వెల్లడిస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు. ఆయా మార్గాల్లో, ఈ రైళ్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నాన్ ఇంటర్ లాకింగ్ పనులు పూర్తి కాగానే తిరిగి ఈ రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయని తెలిపారు.
రద్దయ్యే రైళ్లు ఇవే..
- జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు.. సికింద్రాబాద్-హౌరా-ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
- జూలై 29 నుంచి ఆగస్టు వరకు.. హౌరా-సికింద్రాబాద్-ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
- ఆగస్టు 4 వరకు.. శాలిమార్-చర్లపల్లి ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్
- ఆగస్టు 6 వరకు.. చర్లపల్లి-శాలిమార్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్
- ఆగస్టు 5 వరకు.. శాలిమార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
- ఆగస్టు 7వ వరకు.. సికింద్రాబాద్-శాలిమార్ ఎక్స్‌ప్రెస్
సంబంధిత వార్తలు

Amrit Bharat Express | కాగజ్‌నగర్, ఖమ్మం మీదుగా కోయంబత్తూర్ – ధన్‌బాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
ఆగస్టు 26, 2026

Special Trains | ఆగస్టులో కాచిగూడ-తిరుచానూరు మధ్య.. వరంగల్ మీదుగా కాన్పూర్-మధురై ప్రత్యేక రైళ్లు
జులై 30, 2026

South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా
జులై 28, 2026
తాజావార్తలు
- ●TGEJAC Protest Indira Park | కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సై.. రేపే ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగుల 'మహా ధర్నా'
- ●Sridhar Babu | మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు
- ●పరకాల రగడ నుంచి ప్రజాభవన్ పవర్‌పాలిటిక్స్ వరకు: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా వర్సెస్ సీఎం వార్! తుది అంకానికి చేరిన రాజకీయం
- ●PM E-DRIVE | పీఎం ఈ-డ్రైవ్‌లో ఈవీలకు భారీ ప్రోత్సాహం.. ఏ వాహనాలకు ఎంత సబ్సిడీ..?
- ●Dasoju Sravan | ట్రాఫిక్ చలాన్ల ఆటో-డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం.. బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం సరికాదు: దాసోజు శ్రవణ్
- ●Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం

TGEJAC Protest Indira Park | కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి సై.. రేపే ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగుల 'మహా ధర్నా'

Sridhar Babu | మీ సేవా కేంద్రాలే డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లు : మంత్రి శ్రీధర్‌బాబు

పరకాల రగడ నుంచి ప్రజాభవన్ పవర్‌పాలిటిక్స్ వరకు: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా వర్సెస్ సీఎం వార్! తుది అంకానికి చేరిన రాజకీయం

PM E-DRIVE | పీఎం ఈ-డ్రైవ్‌లో ఈవీలకు భారీ ప్రోత్సాహం.. ఏ వాహనాలకు ఎంత సబ్సిడీ..?



