Ethanol Petrol | ఎథనాల్ పెట్రోల్ వినియోగదారులకు భారీ ఊరట.. ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు..
Ethanol Petrol | ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎథనాల్ కలిపిన పలు రకాల పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా మాఫీ చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మినహాయింపు ఇ22, ఇ25, ఇ27, ఇ30 రకాల ఎథనాల్-బ్లెండెడ్ పెట్రోల్‌కు వర్తిస్తుంది.
Ethanol Petrol | ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎథనాల్ కలిపిన పలు రకాల పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా మాఫీ చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మినహాయింపు ఇ22, ఇ25, ఇ27, ఇ30 రకాల ఎథనాల్-బ్లెండెడ్ పెట్రోల్‌కు వర్తిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం 22, 25, 27, 30 శాతం ఎథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ నిల్ గా నిర్ణయించారు. ఎథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని పెంచడం, వినియోగదారులను పర్యావరణహిత ఇంధనాల వైపు మళ్లించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో భవిష్యత్తులో ఎథనాల్ ఆధారిత ఇంధనాలకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.
ఇంధన ధరల అదుపుకు చర్యలు..
ఇటీవల మే ద్వితీయార్థంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ.7.50 మేర పెరగడం నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. అంతకుముందు మార్చిలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. ఈ నిర్ణయం కారణంగా ప్రభుత్వానికి ఏటా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పటికీ, పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయ వినియోగదారులను రక్షించేందుకు ఆ చర్య తీసుకుంది.
సంబంధిత వార్తలు

Excise Duty | వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు
మార్చి 27, 2026

E20 Petrol India | ఏప్రిల్ 1 నుంచి ఇథనాల్ పెట్రోల్.. పాత కార్ల ఓనర్లకు షాక్..!
ఫిబ్రవరి 28, 2026

GST Change On Tobacco Products | పొగ తాగేవారికి దిమ్మ తిరిగే షాక్.. పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్ను వడ్డింపు..
జనవరి 1, 2026
తాజావార్తలు
- ●Shatrughan Sinha | "కష్టకాలంలో దీదీని వదలను" - రెబల్ క్యాంప్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన శతృఘ్న సిన్హా
- ●Bandi Sanjay | 20 ఏళ్ల నుంచి జ్వరం లేదు.. నాకు మోదీనే స్ఫూర్తి : బండి సంజయ్
- ●Jailer 2 | రజనీకాంత్ జైలర్ 2లో గెస్ట్‌గా బాలీవుడ్ హీరో కన్ఫామ్ - నలభై ఏళ్ల తర్వాత కాంబో రిపీట్
- ●Stock Markets | పశ్చిమ ఆసియా యుద్ధ భయాలు.. స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..
- ●Harish Rao | ఫ్యూచర్ సిటీని కచ్చితంగా రద్దు చేస్తాం.. తేల్చిచెప్పిన హరీశ్‌రావు
- ●Gym Owner Shot Dead | 5 సెకన్లలో 10 రౌండ్లు.. జిమ్ ఓనర్‌పై బుల్లెట్ల వర్షం.. షాకింగ్ వీడియో

Shatrughan Sinha | "కష్టకాలంలో దీదీని వదలను" - రెబల్ క్యాంప్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన శతృఘ్న సిన్హా

Bandi Sanjay | 20 ఏళ్ల నుంచి జ్వరం లేదు.. నాకు మోదీనే స్ఫూర్తి : బండి సంజయ్

Jailer 2 | రజనీకాంత్ జైలర్ 2లో గెస్ట్‌గా బాలీవుడ్ హీరో కన్ఫామ్ - నలభై ఏళ్ల తర్వాత కాంబో రిపీట్

Stock Markets | పశ్చిమ ఆసియా యుద్ధ భయాలు.. స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..



