TECNO POVA 8 5G | టెక్నో పోవా 8 5జీ వచ్చేసింది.. భారీ బ్యాటరీ, ఆకట్టుకుంటున్న ఏఐ ఫీచర్లు..
TECNO POVA 8 5G | మొబైల్స్ తయారీ సంస్థ టెక్నో భారత మార్కెట్లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో పోవా 8 5జీని అధికారికంగా విడుదల చేసింది. గతేడాది వచ్చిన పోవా 7 5జి ఫోన్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ డివైస్‌లో అప్‌గ్రేడ్ చేసిన హార్డ్‌వేర్, ప్రత్యేక ట్రిపుల్-చిప్ ఆర్కిటెక్చర్, పలు ఏఐ ఫీచర్లను కంపెనీ అందించింది. పోవా సిరీస్‌కు ప్రత్యేకమైన సై-ఫై డిజైన్‌ను ఈ ఫోన్‌లో కొనసాగించారు.
Technology | Published On Jun 11, 2026, 2.44 pm IST
TECNO POVA 8 5G | మొబైల్స్ తయారీ సంస్థ టెక్నో భారత మార్కెట్లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో పోవా 8 5జీని అధికారికంగా విడుదల చేసింది. గతేడాది వచ్చిన పోవా 7 5జి ఫోన్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ డివైస్‌లో అప్‌గ్రేడ్ చేసిన హార్డ్‌వేర్, ప్రత్యేక ట్రిపుల్-చిప్ ఆర్కిటెక్చర్, పలు ఏఐ ఫీచర్లను కంపెనీ అందించింది. పోవా సిరీస్‌కు ప్రత్యేకమైన సై-ఫై డిజైన్‌ను ఈ ఫోన్‌లో కొనసాగించారు. షార్ప్ జియోమెట్రిక్ ఎలిమెంట్స్, సెమీ-ట్రాన్స్‌పరెంట్ రియర్ ప్యానెల్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో కొత్త అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లేని అందించారు. ఇది కస్టమైజ్ చేసుకునే లైట్ ప్యానెల్‌గా పనిచేస్తుంది. ఇన్‌కమింగ్ కాల్స్, నోటిఫికేషన్లు, ఛార్జింగ్ స్టేటస్, గేమింగ్ సెషన్ల సమయంలో మొత్తం 49 రకాల యానిమేషన్లను ప్రదర్శిస్తుంది. వినియోగదారులు తమ అభిరుచికి అనుగుణంగా లైటింగ్ ఎఫెక్ట్‌లను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.
టెక్నో సొంత చిప్‌లతో..
ముందు భాగంలో 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను అందించారు. అలాగే రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కలిగి ఉండటంతోపాటు మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో రూపొందించామని టెక్నో పేర్కొంది. కెమెరా విభాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన రియర్ కెమెరాను అందించారు. ఇందులో సోనీ లైటియా 600 సెన్సార్‌ను ఉపయోగించారు. ఇది మెరుగైన లైట్ క్యాప్చర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అధిక డిటెయిల్స్‌ను క్యాప్చర్ చేస్తుంది. 2ఎక్స్ లాస్‌లెస్ జూమ్ సపోర్ట్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ ను ఇచ్చారు. దీనికి తోడు టెక్నో అభివృద్ధి చేసిన రెండు ప్రత్యేక చిప్‌లు కూడా ఉన్నాయి. జి1 సిగ్నల్ ఎన్‌హాన్స్‌మెంట్ చిప్ సహాయంతో ఎలివేటర్లు, బేస్‌మెంట్లు వంటి బలహీన సిగ్నల్ ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. అలాగే ఎస్ఈ1 వై-ఫై ఎన్‌హాన్స్‌మెంట్ చిప్ ద్వారా వై-ఫై రిసెప్షన్, స్థిరత్వాన్ని పెంచవచ్చు. వేడి నియంత్రణ కోసం 15వేల చదరపు మిల్లీమీటర్ల గ్రాఫైట్ షీట్‌ను కూడా అందించారు.
భారీ బ్యాటరీ..
పోవా 8 5జీలో ప్రధాన ఆకర్షణ 8000 ఎంఏహెచ్ బ్యాటరీ. కంపెనీ తెలిపిన ప్రకారం ఇది సాధారణ వినియోగంలో రెండు రోజుల వరకు బ్యాకప్ అందిస్తుంది. 85 గంటలకు పైగా మ్యూజిక్ ప్లేబ్యాక్, 29 గంటలకు పైగా యూట్యూబ్ స్ట్రీమింగ్, 26 గంటలకు పైగా వాట్సాప్ వినియోగం, ఎంఎల్‌బీబీ గేమ్‌లో 14 గంటలకు పైగా నిరంతర గేమింగ్ సపోర్ట్ చేస్తుందని టెక్నో వెల్లడించింది. ఈ ఫోన్‌లో అనేక ఏఐ ఆధారిత ఫీచర్లను అందించారు. ఏఐ యూట్యూబ్ సమ్మరీ ద్వారా పొడవైన వీడియోలను ముఖ్యాంశాలు, టైమ్‌స్టాంప్‌లతో కూడిన టెక్స్ట్ నోట్స్‌గా మార్చవచ్చు. ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ కాల్స్, ఆడియో రికార్డింగ్స్, వర్చువల్ మీటింగ్‌ల సమయంలో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గించి వినియోగదారుడి వాయిస్‌ను స్పష్టంగా అందిస్తుంది. ఏఐ లైట్‌మాస్టర్ 2.0 ఫోటోలలో కనిపించే రిఫ్లెక్షన్లు, లెన్స్ ఫ్లేర్స్, నీడలను ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఫోటోలను నేరుగా బూమరాంగ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసే సదుపాయం కూడా ఉంది. కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉండే ఏఐ హెల్త్ ఫీచర్ ముఖాన్ని స్కాన్ చేసి హార్ట్ రేట్, ఎస్‌పీఓ2, శ్వాస రేటు వంటి ఆరోగ్య సూచికలను అంచనా వేస్తుంది.
ధర వివరాలు..
ఈ డివైస్‌కు రెండు ప్రధాన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని టెక్నో హామీ ఇచ్చింది. అలాగే కొనుగోలుదారులకు మూడు సంవత్సరాల పాటు ఉచితంగా 256జీబీ క్లౌడ్ స్టోరేజ్ అందించనుంది. అర్హత ఉన్న ప్రాంతాల్లో మూడు నెలల గూగుల్ ఏఐ ప్లస్ ట్రయల్‌తోపాటు 2టీబీ క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ కూడా లభిస్తుంది. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మాస్‌తో స్టీరియో స్పీకర్లు, ఐపీ64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. టెక్నో పోవా 8 5జీ ఫోన్‌ను 16 బిట్‌వైట్, టెర్మినల్ గ్రీన్ రంగుల్లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.29,999గా నిర్ణయించారు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.31,999కు విక్రయించనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ను జూన్ 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు పలు ప్రముఖ రిటైల్ స్టోర్లలో విక్రయించనున్నారు.
సంబంధిత వార్తలు

TECNO Spark Go 3 Pro | చవక ధరకే టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్.. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో..
ఆగస్టు 31, 2026

TECNO CAMON 50 Ultra 5G | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నికతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
జులై 17, 2026

TECNO POP X 5G | భారీ బ్యాటరీ, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వచ్చిన టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే లాంచ్..
ఏప్రిల్ 20, 2026
తాజావార్తలు
- ●KTR | సహకార ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెండి.. కేటీఆర్‌కు సంఘాల అధ్యక్షుల రిక్వెస్ట్
- ●Vijay Deverakonda | అఫీషియల్ - "మనం" డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ సినిమా - జానర్ ఇదే
- ●Delhi AIIMS | 98 సెంటీమీటర్ల ఎత్తు.. 22 కిలోల బరువు.. 90 నిమిషాల్లో గర్భాశయం తొలగింపు
- ●Ranabaali Review | రణబాలి రివ్యూ ... విమర్శలకు బదులిచ్చేందుకు విజయ్ చేసిన సినిమానా?
- ●Lulu Mall | లూలూ మాల్.. కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం..!
- ●Bathukamma | 17న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ ప్రదానం

KTR | సహకార ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెండి.. కేటీఆర్‌కు సంఘాల అధ్యక్షుల రిక్వెస్ట్

Vijay Deverakonda | అఫీషియల్ - "మనం" డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ సినిమా - జానర్ ఇదే

Delhi AIIMS | 98 సెంటీమీటర్ల ఎత్తు.. 22 కిలోల బరువు.. 90 నిమిషాల్లో గర్భాశయం తొలగింపు

Ranabaali Review | రణబాలి రివ్యూ ... విమర్శలకు బదులిచ్చేందుకు విజయ్ చేసిన సినిమానా?



