త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran-US | అమెరికా నౌక‌ల‌పై ఇరాన్ డ్రోన్ దాడులు

Iran-US | హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz)లో అమెరికా-ఇరాన్ (Iran-US) మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నాయి. ఒక వైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే మరోవైపు ఇరు దేశాలూ దాడులు చేసుకుంటున్నాయి.

D

International | Published On Apr 20, 2026, 10.42 am IST

Iran-US | అమెరికా నౌక‌ల‌పై ఇరాన్ డ్రోన్ దాడులు
Advertisement

Iran-US | హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz)లో అమెరికా-ఇరాన్ (Iran-US) మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నాయి. ఒక వైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే మరోవైపు ఇరు దేశాలూ దాడులు చేసుకుంటున్నాయి. గ‌ల్ఫ్ ఆఫ్ ఒమ‌న్ (Gulf of Oman) ప్రాంతంలో ఇరాన్ జెండాతో ప్ర‌యాణిస్తున్న స‌రుకు ర‌వాణా నౌక టౌస్కా (Touska)పై అమెరికా నౌకాద‌ళం కాల్పులు జ‌రిపి దాన్ని స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. అమెరికా దుశ్చ‌ర్య‌కు ఇరాన్ తాజాగా బదులిచ్చింది. ఒమ‌న్ జ‌లాల్లో అమెరికా యుద్ధనౌకలే (US military vessels) ల‌క్ష్యంగా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ విష‌యాన్ని ఇరాన్ ప్ర‌భుత్వ అనుబంధ సంస్థ త‌స్నిమ్ వార్తా సంస్థ వెల్ల‌డించింది. అయితే, దాడుల తీవ్ర‌త గురించి ఎలాంటి వివ‌రాలూ పంచుకోలేదు. ఎన్ని డ్రోన్ల‌ను ప్ర‌యోగించారు..? అమెరికా ఆస్తుల‌కు ఏవైనా న‌ష్టం వాటిల్లిందా..? అనే వివ‌రాల‌ను మాత్రం త‌స్నిమ్ వార్తా సంస్థ వెల్ల‌డించ‌లేదు. అమెరికా దాడుల‌కు ప్ర‌తీకారంగానే ఈ అటాక్ జ‌రిగిన‌ట్లు తెలిపింది.

ఇరాన్ జెండాతో ప్ర‌యాణిస్తున్న స‌రుకు ర‌వాణా నౌక టౌస్కా (Touska)పై అమెరికా నౌకాద‌ళం కాల్పులు జ‌రిపింది. ఆ త‌ర్వాత ఆ నౌక‌ను స్వాధీనం చేసుకుంది. గ‌ల్ఫ్ ఆఫ్ ఒమ‌న్ (Gulf of Oman) ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ విష‌యాన్ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్ల‌డించారు. కాగా, ఇరాన్ ఓడ‌రేవుల‌ను దిగ్బంధిస్తామంటూ అమెరికా హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ హెచ్చ‌రిక‌ల త‌ర్వాత టెహ్రాన్‌కు చెందిన నౌక‌ను యూఎస్ నేవీ (US Navy) స్వాధీనం చేసుకోవ‌డం ఇదే తొలిసారి. ఈ ఘ‌ట‌న‌పై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. టౌస్కాపై జ‌రిగిన దాడి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించ‌డ‌మేన‌ని పేర్కొంది. ఈ చ‌ర్య‌కు త్వ‌ర‌లోనే ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని హెచ్చ‌రించింది. అన్న‌ట్లుగానే అమెరికా నౌక‌లే ల‌క్ష్యంగా డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది.

Also Read..

8 మంది చిన్నారుల‌ను కాల్చి చంపిన వ్య‌క్తి.. మృతుల్లో ఏడుగురు అత‌డి పిల్ల‌లే

హ‌ర్మూజ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌.. ఇరాన్ జెండాతో వెళ్తున్న నౌక‌ను స్వాధీనం చేసుకున్న అమెరికా

లాభాల్లో మొద‌లై ఫ్లాట్ గా ట్రేడ‌వుతున్న సూచీలు.. భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

Advertisement
Advertisement