SEBI | ఓయో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. మరో 4 కంపెనీలకూ అనుమతి..
SEBI | భారత మూలధన మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) ఇటీవల మొత్తం ఐదు కంపెనీల ఐపీఓలకు ఆమోదం తెలిపింది. వీటిలో ఓరావెల్ స్టేస్ (ఓయో మాతృసంస్థ), అద్వాంతా ఎంటర్ ప్రైజెస్, ట్రూ హోమ్ ఫైనాన్స్, మెహతా హైటెక్ ఇండస్ట్రీస్, వీగాల్యాండ్ డెవలపర్స్ ఉన్నాయి. సెబీ జూన్ 1న వీగాలాండ్ డెవలపర్స్, ట్రూహోమ్ ఫైనాన్స్ సంస్థల ప్రాథమిక ఐపీఓ పత్రాలపై పరిశీలన పూర్తి చేసి అభిప్రాయాలు జారీ చేసింది.
SEBI | భారత మూలధన మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) ఇటీవల మొత్తం ఐదు కంపెనీల ఐపీఓలకు ఆమోదం తెలిపింది. వీటిలో ఓరావెల్ స్టేస్ (ఓయో మాతృసంస్థ), అద్వాంతా ఎంటర్ ప్రైజెస్, ట్రూ హోమ్ ఫైనాన్స్, మెహతా హైటెక్ ఇండస్ట్రీస్, వీగాల్యాండ్ డెవలపర్స్ ఉన్నాయి. సెబీ జూన్ 1న వీగాలాండ్ డెవలపర్స్, ట్రూహోమ్ ఫైనాన్స్ సంస్థల ప్రాథమిక ఐపీఓ పత్రాలపై పరిశీలన పూర్తి చేసి అభిప్రాయాలు జారీ చేసింది. అనంతరం జూన్ 2న ఓయో ఐపీఓకు, జూన్ 3న అద్వాంతా ఎంటర్‌ప్రైజెస్‌కు, జూన్ 5న మెహతా హైటెక్ ఇండస్ట్రీస్‌కు అనుమతి ఇచ్చింది. సెబీ నుంచి అబ్జర్వేషన్ లెటర్ అందుకున్న తర్వాత కంపెనీలు ఒక సంవత్సరం లోపు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసి తమ ఐపీఓలను ప్రారంభించవచ్చు.
ఓయో, వీగాలాండ్ డెవలపర్స్, మెహతా హైటెక్ ఇండస్ట్రీస్..
ఓయో మాతృసంస్థ ప్రిజమ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రతిపాదిత ఐపీఓకు సెబీ ఆమోదం లభించినట్లు జూన్ 2న వెల్లడైంది. 2025 డిసెంబర్‌లో సంస్థ రూ.6,650 కోట్ల ఐపీఓ కోసం గోప్యంగా డ్రాఫ్ట్ పత్రాలను సమర్పించింది. ఈ ఇష్యూతో కంపెనీ సుమారు 7-8 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇది 2021లో లిస్టింగ్ ప్రయత్నం సమయంలో కోరుకున్న సుమారు 12 బిలియన్ డాలర్ల విలువ కంటే తక్కువ కావడం గమనార్హం. వీగాలాండ్ డెవలపర్స్, మెహతా హైటెక్ ఇండస్ట్రీస్ సంస్థలు 2025 డిసెంబర్ 30న సెబీకి డ్రాఫ్ట్ పత్రాలు సమర్పించగా, అద్వాంతా ఎంటర్‌ప్రైజెస్ 2026 జనవరి 19న ఐపీవో పత్రాలను దాఖలు చేసింది. ట్రూహోమ్ ఫైనాన్స్ 2026 మార్చి 9న సెబీని ఆశ్రయించింది. కేరళకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ వీగాలాండ్ డెవలపర్స్ తన తొలి పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.250 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో ఉంటుంది. ఈ నిధులను ప్రస్తుత, భవిష్యత్ ప్రాజెక్టుల అభివృద్ధి, గుర్తించిన భూమి కొనుగోలు, భవిష్యత్ భూసేకరణలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనుంది.
ట్రూ హోమ్ ఫైనాన్స్, అద్వాంతా ఎంటర్ ప్రైజెస్..
వార్‌బర్గ్ పింకస్ మద్దతుతో పనిచేస్తున్న ట్రూహోమ్ ఫైనాన్స్ రూ.3వేల కోట్ల ఐపీఓను తీసుకురానుంది. ఇందులో రూ.1,500 కోట్ల తాజా షేర్ల జారీతోపాటు మరో రూ.1,500 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ఉంటుంది. ప్రమోటర్ అయిన మ్యాంగో క్రెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించనుంది. తాజా ఇష్యూ ద్వారా వచ్చే నిధులను మూలధన బలోపేతం, రుణాల పంపిణీ, వ్యాపార విస్తరణ అవసరాల కోసం వినియోగించనుంది. హైదరాబాద్ కేంద్రంగా వ్యవసాయ పరిష్కారాలను అందిస్తున్న అద్వాంతా ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓ పూర్తిగా ఓఎఫ్‌ఎస్ రూపంలో ఉంటుంది. ప్రమోటర్ యూపీఎల్ తో పాటు మెల్‌వుడ్ హోల్డింగ్స్ 2, కేఐఏ ఈబీటీ స్కీమ్ 2 సంస్థలు కలిపి 3.61 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. ఇందులో తాజా షేర్ల జారీ ఉండదు. గుజరాత్‌కు చెందిన మెహతా హైటెక్ ఇండస్ట్రీస్ కార్బన్ డయాక్సైడ్ లేజర్ పరికరాలు, ఫైబర్ లేజర్ పరికరాలు, సీఎన్‌సీ రౌటర్లు, డిజిటల్ ప్రింటర్ల తయారీలో నిమగ్నమై ఉంది. సంస్థ 62 లక్షల తాజా షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించనుంది. ఈ మొత్తాన్ని గుజరాత్‌లోని సనంద్ జీఐడీసీలో కొత్త తయారీ కేంద్రం ఏర్పాటు, దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jagadeeshwar Rao | ఆర్వోకు నామినేషన్‌ను తిరస్కరించే అధికారం లేదు: టీపీసీసీ ఉపాధ్యక్షుడు జగదీశ్వర్‌రావు
- ●Kalyan Banerjee Ultimatum | "అభిషేక్ ఉంటే నేనుండను!" - మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడి అల్టిమేటం, టీఎంసీలో ముదిరిన సంక్షోభం
- ●EPFO | ఈపీఎఫ్‌వో సభ్యులకు చాలా మందికి తెలియని బెనిఫిట్.. పైసా ఖర్చు లేకుండా రూ.7 లక్షల బీమా లభిస్తుంది..
- ●Ponnam Ashok Goud | నామినేషన్ తిరస్కరణను నేరంగా పరిగణించాలి: పొన్నం అశోక్ గౌడ్
- ●Urfi Javed | నన్ను బతకనివ్వరా? - సోషల్ మీడియా వేధింపులపై ఉర్ఫీ జావెద్ ఎమోషనల్ పోస్ట్
- ●Ethanol Petrol | ఎథనాల్ పెట్రోల్ వినియోగదారులకు భారీ ఊరట.. ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు..

Jagadeeshwar Rao | ఆర్వోకు నామినేషన్‌ను తిరస్కరించే అధికారం లేదు: టీపీసీసీ ఉపాధ్యక్షుడు జగదీశ్వర్‌రావు

Kalyan Banerjee Ultimatum | "అభిషేక్ ఉంటే నేనుండను!" - మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడి అల్టిమేటం, టీఎంసీలో ముదిరిన సంక్షోభం

EPFO | ఈపీఎఫ్‌వో సభ్యులకు చాలా మందికి తెలియని బెనిఫిట్.. పైసా ఖర్చు లేకుండా రూ.7 లక్షల బీమా లభిస్తుంది..

Ponnam Ashok Goud | నామినేషన్ తిరస్కరణను నేరంగా పరిగణించాలి: పొన్నం అశోక్ గౌడ్






