Massive Fire | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకుపోయిన 50 కుటుంబాలు
Massive Fire | నోయిడాలో (Noida Building) భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. మమురా గ్రామంలోని (Mamura village) ఓ నివాస భవనం పార్కింగ్ ఏరియాలో ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు చెలరేగాయి.
Massive Fire | నోయిడాలో (Noida Building) భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. మమురా గ్రామంలోని (Mamura village) ఓ నివాస భవనం పార్కింగ్ ఏరియాలో ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు చెలరేగాయి. అవి భవనం మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 100 మందిని అధికారులు రక్షించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 66 ఫేజ్-3 పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూటీకి ఛార్జింగ్ పెట్టిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దాని నుంచి వెలువడిన నిప్పు రవ్వలు గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్క్ చేసి ఉన్న ఇతర వాహనాలకు అంటుకుని మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ బిల్డింగ్ మొత్తాన్ని కమ్మేసింది. ఆ భవనంలో 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. పొగలు వస్తుండటాన్ని గమనించిన నివాసితులు ఏం జరుగుతోందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అందులోనే చిక్కుకుపోయారు.
బయటకు వెళ్లే వీలు లేకపోవడంతో.. వారంతా అక్కడ చిక్కుకుపోయి కాపాడాలంటూ అర్తనాదాలు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు స్థానికుల సాయంతో భవనంలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కింది నుంచి బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో భవనం పై అంతస్తు నుంచి నిచ్చెనల సాయంతో పక్క బిల్డింగ్‌లోకి తరలిస్తున్నారు. దాదాపు 100 మందిని రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
VIDEO | Fire breaks out in a residential building in Mamura village in Noida. Rescue operations underway. More details are awaited.
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/SpfsoCaow7
— Press Trust of India (@PTI_News) July 15, 2026
Also Read..
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే.. ట్రాఫిక్ నివారణే ధ్యేయం..
భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ డిస్‌ప్లే, ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్70 మ్యాక్స్
సంబంధిత వార్తలు

Simple Wave | సింపుల్ వేవ్ వచ్చేసింది.. 243 కి.మీ రేంజ్‌తో కొత్త ఈవీ స్కూటర్..
సెప్టెంబర్ 2, 2026

Massive Fire | హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. వైద్యం కోసం వచ్చిన బంగ్లాదేశీయులు 9 మంది మృతి
ఆగస్టు 19, 2026

Ather Energy | రూ.1వేయి కోట్ల బూస్ట్‌తో దూసుకెళ్లిన ఏథర్ షేర్లు.. ఇంకా కొనాలా? అమ్మాలా?
జులై 15, 2026
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'
- ●Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!
- ●Traffic Restrictions | రేపు నల్లగొండ ఎక్స్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు..
- ●Rajanna Temple | శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి
- ●Kavitha | సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు.. కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటు..!
- ●Uttam Kumar Reddy | ప్రతి నీటి బొట్టుకు జియో ట్యాగింగ్

Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'

Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!

Traffic Restrictions | రేపు నల్లగొండ ఎక్స్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Rajanna Temple | శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి



