త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Massive Fire | షూ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

Massive Fire | ఢిల్లీలోని మొగ‌ల్‌పురి (Mangolpuri) పారిశ్రామిక వాడ‌లో ఉన్న ఓ బూట్ల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లో భారీ అగ్నిప్ర‌మాదం (Massive Fire) జ‌రిగింది. దీంతో న‌లుగురు దుర్మ‌ర‌ణం చెంద‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

G

National | Published On Oct 31, 2026, 7.50 am IST

Massive Fire | షూ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం.. న‌లుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Massive Fire | త్రినేత్ర న్యూస్‌: ఢిల్లీలోని మంగోల్‌పురి (Mangolpuri) పారిశ్రామిక వాడ‌లో ఉన్న ఓ బూట్ల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లో భారీ అగ్నిప్ర‌మాదం (Massive Fire) జ‌రిగింది. దీంతో న‌లుగురు దుర్మ‌ర‌ణం చెంద‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. శుక్ర‌వారం రాత్రి షూ ఫ్యాక్ట‌రీలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగడంతో ద‌ట్ట‌మైన పొగ‌లు అల‌ముకున్నాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. 20 ఫైర్ ఇంజిన్ల‌తో మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు.

అనంత‌రం ప‌రిశ్ర‌మ (Shoe Factory) లోప‌లికి వెళ్లిన అగ్నిమాప‌క సిబ్బంది.. అప‌స్మార‌క స్థితిలోకి చేరిన న‌లుగురితో పాటు మ‌రో ఇద్ద‌రిని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే న‌లుగురు అప్ప‌టికే మృతి చెందార‌ని వైద్యులు నిర్ధారించారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని, వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు. ఫ్యాక్ట‌రీ బేస్‌మెంట్‌లో (Basement) మంట‌లు అంటుకున్నాయ‌ని, క్ర‌మంగా అవి బిల్డింగ్ మొత్తానికి విస్త‌రించాయ‌ని ఫైర్ ఆఫీస‌ర్ ఏడీవో ప‌రాస్ కుమార్ చెప్పారు. మంట‌ల‌ను అదుపుచేయ‌డానికి తీవ్రంగా శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌న్నారు. బూట్ల‌ను త‌యారు చేసి అక్క‌డే స్టోర్ చేస్తార‌ని వెల్ల‌డించారు.

ట్యాగ్స్:

BasementDelhiMangolpuriMassive FireShoe Factory
Advertisement
Advertisement