ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్
FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్లోకి స్పెయిన్ జట్టు దూసుకువెళ్లింది. తొలి సెమీఫైనల్లో మ్యాచ్‌లో స్పెయిన్ అద్భుత ప్రదర్శన చేసింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను 2-0తో ఓడించి టైటిల్ పోరులో నిలిచింది. మ్యాచ్ ప్రారంభం నుంచే మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన స్పెయిన్.. ఫ్రాన్స్‌ను సమర్థవంతంగా కట్టడి చేసింది.
- ఫ్రాన్స్‌పై 2-0 తేడాతో ఘన విజయం
- పని చేయని ఎంబాపే మ్యాజిక్
- ఒక్క గోల్ చేయలేకపోయిన ఫ్రాన్స్ జట్టు
- అర్జెంటీనా-ఇంగ్లండ్ మ్యాచ్‌లో విజేతతో తుదిపోరు
- న్యూయార్క్ వేదికగా మ్యాచ్
FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్లోకి స్పెయిన్ జట్టు దూసుకువెళ్లింది. తొలి సెమీఫైనల్లో మ్యాచ్‌లో స్పెయిన్ అద్భుత ప్రదర్శన చేసింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను 2-0తో ఓడించి టైటిల్ పోరులో నిలిచింది. మ్యాచ్ ప్రారంభం నుంచే మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన స్పెయిన్.. ఫ్రాన్స్‌ను సమర్థవంతంగా కట్టడి చేసింది. మికెల్ ఒయార్జాబల్ తొలి గోల్ చేయగా.. ద్వితీయార్థంలో పెడ్రో మరో గోల్‌తో జట్టుకు విజయాన్ని అందించారు. రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్-అర్జెంటీనా మధ్య మ్యాచ్‌లో విజేతతో ఆదివారం న్యూయార్క్‌లోని న్యూజెర్సీ స్టేడియంలో తుదిపోరు జరుగనుంది.
పెనాల్టీతో స్పెయిన్‌కు ఆధిక్యం
మ్యాచ్ ప్రారంభంలో ఫ్రాన్స్ ఎటాకింగ్‌కు దిగుతూ స్పెయిన్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాప్పే తన వేగంతో స్పెయిన్ రక్షణను ఛేదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో స్పెయిన్‌కు కీలక అవకాశం లభించింది. 19 ఏళ్ల లామిన్ యమాల్ బాక్స్‌లోకి చొచ్చుకెళ్లిన సమయంలో ఫ్రాన్స్ డిఫెండర్ లూకాస్ డిగ్నే ఫౌల్ చేయడంతో రిఫరీ వెంటనే పెనాల్టీ ప్రకటించాడు. 22వ నిమిషంలో మికెల్ ఒయార్జాబల్ పెనాల్టీని గోల్‌గా మలిచి స్పెయిన్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఫ్రాన్స్ గోల్‌కీపర్ మైక్ డైవ్ చేసినా బంతిని అడ్డుకోలేకపోయాడు.
పోరో గోల్‌తో విజయం..
తొలిభాగంలో ఆధిక్యంలో నిలిచిన స్పెయిన్.. ద్వితీయార్థంలోనూ అదే జోరును కొనసాగించింది. 58వ నిమిషంలో డాని ఒల్మోతో అద్భుతమైన వన్-టూ పాస్ ఆడిన పెడ్రో పోరో.. గోల్‌పోస్ట్ మూలలోకి అద్భుతంగా బంతిని పంపించి స్కోరును 2-0కు చేర్చాడు. ఈ గోల్‌తో ఫ్రాన్స్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. స్పెయిన్ మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. రెండుగోల్స్ ఫ్రాన్స్ వెనుకపడగా.. రయాన్ చెర్కీని కోచ్ డిజైర్ డూయే బరిలోకి దించాడు. ఎటాకింగ్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఎంబాప్పే సైతం పలుమార్లు స్పెయిన్ డిఫెన్స్‌ను ఛేదించేందుకు ప్రయత్నించినా గోల్‌కీపర్ ఉనాయ్ సిమోన్ అద్భుత సేవ్స్‌తో అడ్డుకున్నాడు. మరోవైపు డిఫెండర్ మార్క్ కుకురెల్లా సైతం ఎంబాప్పే ఎటాకింగ్‌ను తన అద్భుతమైన ట్యాకిల్‌తో నిలువరించాడు. స్పెయిన్ పటిష్టమైన డిఫెన్స్‌ను ఛేదించడంలో ఫ్రాన్స్ పూర్తిగా విఫలమైంది.
ఫైనల్ బెర్త్
తుది విజిల్ మోగగానే స్పెయిన్ ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు ఫ్రాన్స్ ఆటగాళ్లు నిరాశతో మైదానాన్ని వీడారు. ఈ విజయంతో ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా స్పెయిన్ నిలిచింది. ఫ్రాన్స్ ఇప్పుడు మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. మ్యాచ్‌లో విశేషాల విషయానికి వస్తే.. స్పెయిన్ తరఫున మికెల్ ఒయార్జాబల్ తన చివరి 20 మ్యాచ్‌ల్లో 18వ గోల్ నమోదు చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇది అతని 30వ గోల్. మొత్తం మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా ‘క్లీన్ షీట్’తో స్పెయిన్ ఫైనల్‌కు చేరుకుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tandur Red Gram Australia Export | సరిహద్దులు దాటిన తాండూరు కంది ఘుమఘుమలు.. ఆస్ట్రేలియాకు తొలి ఎగుమతి ప్రారంభం
- ●Samyuktha | సంయుక్తకు ఇదేం పరీక్ష..! సినిమాలన్నీ రెడీ.. రిలీజ్ డిలే..!
- ●Ponguleti Srinivas Reddy | రైళ్ల కేటాయింపులో కేంద్రం వివక్ష తగదు
- ●Telangana Police Digital Initiatives | 15 సెకన్లలో నేరగాళ్ల గుర్తింపు: తెలంగాణ పోలీసుల సరికొత్త అస్త్రాలు
- ●Vaishnavi Sharma | వైష్ణవి శర్మ స్పిన్ మ్యాజిక్.. జింబాబ్వే 131 ఆలౌట్!
- ●Jalamandali | అక్రమంగా అమర్చిన 13 మోటార్లు స్వాధీనం

Tandur Red Gram Australia Export | సరిహద్దులు దాటిన తాండూరు కంది ఘుమఘుమలు.. ఆస్ట్రేలియాకు తొలి ఎగుమతి ప్రారంభం

Samyuktha | సంయుక్తకు ఇదేం పరీక్ష..! సినిమాలన్నీ రెడీ.. రిలీజ్ డిలే..!

Ponguleti Srinivas Reddy | రైళ్ల కేటాయింపులో కేంద్రం వివక్ష తగదు

Telangana Police Digital Initiatives | 15 సెకన్లలో నేరగాళ్ల గుర్తింపు: తెలంగాణ పోలీసుల సరికొత్త అస్త్రాలు




