Motorola Edge 70 Max | భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ డిస్‌ప్లే, ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్70 మ్యాక్స్
Motorola Edge 70 Max | మోటోరోలా ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ని అధికారికంగా విడుదల చేసింది. అధిక పనితీరు కోరుకునే వినియోగదారులు, మొబైల్ గేమింగ్ ప్రియులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించింది.
Technology | Published On Jul 15, 2026, 3.14 pm IST
Motorola Edge 70 Max | మోటోరోలా ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ని అధికారికంగా విడుదల చేసింది. అధిక పనితీరు కోరుకునే వినియోగదారులు, మొబైల్ గేమింగ్ ప్రియులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించింది. ప్రీమియం డిజైన్, అత్యాధునిక ప్రాసెసర్, భారీ బ్యాటరీ, శక్తివంతమైన ఏఐ ఫీచర్లతో ఈ డివైస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్లాట్‌ఫామ్‌ను అందించింది. ఇందులో 3.8గిగాహెడ్జ్ ప్రైమ్ కోర్ ఉండగా గత తరం చిప్‌సెట్‌తో పోలిస్తే సీపీయూ పనితీరు 36 శాతం, జీపీయూ రెండరింగ్ వేగం 11 శాతం, ఏఐ ప్రాసెసింగ్ సామర్థ్యం 46 శాతం మెరుగుపడినట్లు పేర్కొంది. ఈ ఫోన్‌లో 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌ను అందించింది. గేమింగ్ సమయంలో వేడి నియంత్రణ కోసం మెష్ కూలింగ్ సిస్టమ్ ను ఉపయోగించారు. ఇందులో 5,500 చదరపు మిల్లీమీటర్ల వేపర్ చాంబర్‌తోపాటు మొత్తం 29,550 చదరపు మిల్లీమీటర్ల థర్మల్ కూలింగ్ మెటీరియల్స్, లిక్విడ్ మెటల్, పీసీబీఏ థర్మల్ పేస్ట్‌ను ఉపయోగించారు. దీని వల్ల అధిక లోడ్ సమయంలో సీపీయూ ఉష్ణోగ్రతను గరిష్టంగా 7.1 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించవచ్చని కంపెనీ తెలిపింది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ (2కె) ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ ఎల్పీటీవో ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. 144 హెడ్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 360 హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 510 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, గరిష్టంగా 7000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. పాంటోన్ వ్యాలిడేటెడ్, పాంటోన్ స్కిన్‌టోన్ వ్యాలిడేటెడ్ సర్టిఫికేషన్‌తోపాటు డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10 ప్లస్ సపోర్ట్ కూడా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 96.8 శాతంగా ఉంది. ఈ ఫోన్‌లో 7100ఎంఏహెచ్ బ్యాటరీని నాలుగో తరం సిలికాన్-కార్బన్ టెక్నాలజీతో అందించారు. బ్యాటరీ పెద్దదైనా ఫోన్ మందం కేవలం 8.29 మిల్లీమీటర్లుగానే ఉంటుంది. కంపెనీ ప్రకారం ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 25 గంటల గేమింగ్, 42 గంటల వీడియో ప్లేబ్యాక్, 58 గంటల మిక్స్‌డ్ వినియోగం అందిస్తుంది. 90వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. దీని ద్వారా సుమారు 21 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అలాగే 25వాట్ క్యూఐ2.2 మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మ్యాగ్‌సేఫ్ యాక్సెసరీలకు పూర్తిగా అనుకూలంగా ఉండే ఈ ఫోన్ వైర్‌లెస్ ద్వారా 86 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. అలాగే 5వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
పవర్‌ఫుల్ కెమెరాలు..
వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో అందించారు. దీనికి తోడు 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ మ్యాక్రో కెమెరా ఉంది. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండగా, 4కె వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. అన్ని కెమెరాల్లో 4కె వీడియో రికార్డింగ్, 360 డిగ్రీ హారిజన్ లాక్, ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఆడియో జూమ్, ఏఐ యాక్షన్ షాట్, ఫ్రేమ్ మ్యాచ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఎక్స్‌పై పనిచేస్తుంది. దీనికి మూడు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని మోటోరోలా ప్రకటించింది. గూగుల్ జెమినీ, కోపైలట్, పర్‌ప్లెక్సిటీతోపాటు మోటరోలా సొంత కిరా ఏఐ అసిస్టెంట్‌ను కూడా ఇందులో అందించారు. క్యాచ్ మీ అప్, రీకాల్, క్రియేటర్ జోన్, స్క్రిబుల్ టు ఇమేజ్, క్రియేట్ అవతార్, స్టైల్ సింక్ వంటి ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో..
బిల్డ్ క్వాలిటీ పరంగా ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, ముందు-వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌ను అందించారు. ఎంఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ సర్టిఫికేషన్‌తోపాటు ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను కూడా పొందింది. దీంతో దుమ్ము, నీరు, అధిక పీడన వేడి నీటి జెట్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. 1.5 మీటర్ల లోతు వరకు 30 నిమిషాల పాటు నీటిలో కూడా పనిచేస్తుంది. ఫోన్‌ను పాంటోన్ ఆక్వా గ్రే, పాంటోన్ ఐస్ మెల్ట్, పాంటోన్ డార్క్ షాడో రంగుల్లో అందిస్తున్నారు. వై-ఫై 7, థింక్‌షీల్డ్ సెక్యూరిటీ, డాల్బీ అట్మాస్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, స్నాప్‌డ్రాగన్ సౌండ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధర వివరాలు..
భారత్‌లో 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.54,999 ఉండగా, 12జీబీ, 256జీబీ వేరియంట్ ధరను రూ.59,999గా నిర్ణయించారు. జూలై 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా రూ.5వేల తక్షణ తగ్గింపు లేదా ఎక్స్చేంజ్‌పై రూ.5వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
సంబంధిత వార్తలు

Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..
జులై 8, 2026

Nothing Phone 4b | నథింగ్ ఫోన్ 4బి వచ్చేసింది.. భారత్‌కు స్పెషల్ ఎడిషన్.. అదిరిపోయిన ఏఐ ఫీచర్లు..
జులై 7, 2026

Samsung Galaxy A27 5G | శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ27 5జి ఫోన్.. ఏఐ ఫీచర్లు, పవర్‌ఫుల్ డిస్‌ప్లే..
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●Mahesh Kumar Goud | దేశంలో విద్యావిధానాన్ని వ్యాపారంగా మార్చారు.. బీజేపీ సర్కార్‌పై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్
- ●Ather Energy | రూ.1వేయి కోట్ల బూస్ట్‌తో దూసుకెళ్లిన ఏథర్ షేర్లు.. ఇంకా కొనాలా? అమ్మాలా?
- ●Google Images | గూగుల్ ఇమేజెస్‌కు 25 ఏళ్లు.. ఏఐ ఇమేజ్ జనరేషన్‌తో భారీ అప్డేట్..
- ●Manipur | మరోసారి భగ్గుమన్న మణిపూర్.. అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి.. వాహనాలకు నిప్పు
- ●Errolla Srinivas | పైరవికారులు, దళారుల పాలనలా మారిన ప్రజా పాలన: ఎర్రోళ్ల శ్రీనివాస్
- ●Hyderabad | రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వద్ద అద్దె వాహనదారుల సమ్మె

Mahesh Kumar Goud | దేశంలో విద్యావిధానాన్ని వ్యాపారంగా మార్చారు.. బీజేపీ సర్కార్‌పై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

Ather Energy | రూ.1వేయి కోట్ల బూస్ట్‌తో దూసుకెళ్లిన ఏథర్ షేర్లు.. ఇంకా కొనాలా? అమ్మాలా?

Google Images | గూగుల్ ఇమేజెస్‌కు 25 ఏళ్లు.. ఏఐ ఇమేజ్ జనరేషన్‌తో భారీ అప్డేట్..

Manipur | మరోసారి భగ్గుమన్న మణిపూర్.. అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి.. వాహనాలకు నిప్పు



