త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashtrapati Nilayam | రాష్ట్రపతి నిలయం సందర్శనకు బ్రేక్‌.. జనవరి 2 నుంచి అనుమ‌తి..!

Rashtrapati Nilayam | బొల్లారంలోని చారిత్రక రాష్ట్రపతి నిలయం సందర్శనకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నేపథ్యంలో డిసెంబర్‌ 1 నుంచి జనవరి 1 వరకు ప్రజలకు ప్రవేశం నిలిపివేయనున్నారు. రాష్ట్రపతి విడిది ఏర్పాట్లు, సంబంధిత కార్యక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

P

Hyderabad | Published On Nov 25, 2026, 10.20 pm IST

Rashtrapati Nilayam | రాష్ట్రపతి నిలయం సందర్శనకు బ్రేక్‌.. జనవరి 2 నుంచి అనుమ‌తి..!
Advertisement

Rashtrapati Nilayam | బొల్లారంలోని చారిత్రక రాష్ట్రపతి నిలయం సందర్శనకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నేపథ్యంలో డిసెంబర్‌ 1 నుంచి జనవరి 1 వరకు ప్రజలకు ప్రవేశం నిలిపివేయనున్నారు. రాష్ట్రపతి విడిది ఏర్పాట్లు, సంబంధిత కార్యక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తిరిగి జనవరి 2 నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. దీంతో రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలనుకునే పర్యాటకులు, విద్యార్థులు ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ పర్యటనలను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. మరోవైపు రాష్ట్రపతి నిలయం మేనేజర్‌గా స్పెషల్‌ కలెక్టర్‌ (నీటిపారుదల, కమాండ్‌ ఏరియా అభివృద్ధి) ఆర్‌డీ మాధురి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన కే రజనీ ప్రియ స్థానంలో ఆమె నియమితులయ్యారు.

రజనీ ప్రియ తన పదవీకాలంలో రాష్ట్రపతి నిలయాన్ని ప్రముఖ వారసత్వ కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విశేష కృషి చేశారని అధికారులు ప్రశంసించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాంగణాన్ని ప్రజలు సందర్శించేలా, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ఆమె తీసుకున్న చర్యలను కొనియాడారు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలనుకునే విద్యార్థులు, విద్యాసంస్థల ప్రతినిధులు సందర్శనకు సంబంధించిన వివరాల కోసం అధికారులను సంప్రదించవచ్చు. ఇందుకోసం 040-29560518 లేదా 9491008587 నంబర్లను అందుబాటులో ఉంచారు. అలాగే vfc.rpn@gmail.com ఈ-మెయిల్‌ ద్వారా కూడా సందర్శనకు సంబంధించిన సమాచారం పొందవచ్చని అధికారులు తెలిపారు. సందర్శన తేదీలు, ఇతర వివరాలను ముందుగానే తెలుసుకుని పర్యటనకు ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement