TTD | 121 కిలోల బంగారు ఆభరణాలు.. తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడి భారీ విరాళం
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను (Gold Ornaments) శ్రీవారికి సమర్పించారు.
Andhra pradesh | Published On Nov 26, 2026, 12.13 pm IST
TTD | త్రినేత్ర న్యూస్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను (Gold Ornaments) శ్రీవారికి సమర్పించారు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్దమాన్ జైన్ (Vardhaman Jain).. శ్రీనివాసుని పాదాల నుంచి శిరస్సు వరకు మొత్తం 46 రకాల ఆభరణాలను తయారు చేయించారు. ప్రత్యేక వాహనంలో చెన్నై నుంచి తిరుమలకు (Tirumala) తరలించిన ఆ ఆభరణాలను గురువారం ఉదయం టీటీడీ (TTD) అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. వీటి విలువ సుమారు రూ.160 కోట్ల వరకు ఉంటుందని అంచనా. టీటీడీ చరిత్రలో వేంకటేశ్వరునికి భక్తులు సమర్పించిన కానుకల్లో ఇదే అతి పెద్దదని ఆలయ వర్గాలు వెల్లడించాయి. కాగా, 2025 జనవరి 19న రూ.6 కోట్లు విరాళంగా అందజేసిన ఆయన.. ఈ ఏడాది మే 16న ఎలక్ట్రిక్ బస్సును అందించారు.
46 రకాల ఆభరణాలతో కూడిన ఈ ప్రత్యేక సెట్‌లో కిరీటం, శంఖుచక్రాలు, కటి వరద హస్తాలు, వడ్డాణం, పాదుకలు సహ ఆభరణాలు ఉన్నాయి. టీటీడీ అధికారులు, అర్చకుల సూచన మేరకు ఓ ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ ద్వారా వీటిని సిద్ధం చేయించారు. గురువారం ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వీటిని తిరుమలకు తరలించారు. వీటి ప్రదర్శన కోసం ఆలయంలోని రంగనాయక మండపంలో ప్రత్యేక వేదికను కూడా సిద్ధం చేశారు.

కాగా, తిరుమల శ్రీవారి (Venkateswara Swamy) మూలవిరాట్టు, ఉత్సవమూర్తుల అలంకరణ కోసం ఇప్పటికే దాదాపు 650 కిలోల ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ.6 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వజ్రాలు, రత్నాలు, కెంపుల విలువను కలిపితే మొత్తం విలువ రూ.10 వేల కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. తాజాగా అందనున్న 121 కిలోల స్వర్ణాభరణాల సెట్‌తో శ్రీవారి అలంకరణకు మరో అద్భుతమైన ఆభరణాల సముదాయం చేరనుంది.
శ్రీనివాసుడికి నిత్యం అలంకరించే ఆభరణాలు..
స్వర్ణ పద్మపీఠం: పాదాల కింద ఉండే బంగారు పీఠం
స్వర్ణ పాదాలు: పాదాలకు అలంకరించే బంగారు కవచాలు
నూపురాలు: పాదాలకు ధరించే ఆభరణాలు
కాంచిగుణం: నడుముకు ధరించే ఆభరణం
దశావతార రశన: దశావతార చిత్రాలతో కూడిన నడుము ఆభరణం
సాలగ్రామ హారం: అత్యంత ప్రత్యేకమైన హారం
తులసి హారం: బంగారంతో రూపొందించిన తులసి ఆకుల హారం
అష్టోత్తర హారం: 108 నామాలతో కూడిన హారం
సహస్రనామ హారం: వేయి నామాలతో కూడిన హారం
చతుర్భుజ లక్ష్మీ హారం: లక్ష్మీదేవి ప్రతిమతో కూడిన హారం
చంద్రహారం: బంగారు హారం.. స్వామివారి వక్షస్థలం, ఉదర భాగంపై అందంగా అమరేలా ఉంటుంది.
యజ్ఞోపవీతం: బంగారు పవిత్ర దారం
సూర్య కఠారి: బంగారు ఖడ్గం
నాగాభరణాలు: చేతులకు, భుజాలకు ధరించే ఆభరణాలు
శంఖు, చక్రాలు: రత్నాలు పొదిగిన ఆభరణాలు
కర్ణపత్రాలు: చెవులకు ధరించే ఆభరణాలు
కిరీటం: స్వర్ణ, రత్న కిరీటాలు
సంబంధిత వార్తలు

Vaikunta Dwara Darshan | శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు.. 27న వైకుంఠద్వార దర్శన టికెట్లు రిలీజ్!
నవంబర్ 24, 2026

Ananda Nilayam Vimana | తిరుమల ఆనందనిలయ విమానం వెనుక ఆసక్తికర చరిత్ర..!
నవంబర్ 22, 2026

Padmavathi Temple | తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు.. పంచమితీర్థానికి ప్రత్యేక క్యూ లైన్లు
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
- ●Indian Army microlight aircraft | రన్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్.. భారత సైన్యం అసాధారణ ఫీట్..!
- ●Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి
- ●Nifty 50 | నిఫ్టీ 31,700కు చేరే ఛాన్స్.. ముందున్న కీలక అడ్డంకి ఇదే..
- ●Arvind Dharmapuri | రాష్ట్రంలో ప్రారంభమైన కాంగ్రెస్ పతనం.. ఎన్నికల నాటికి పూర్తిగా భూస్థాపితం: ఎంపీ అర్వింద్
- ●26/11 Terror Attacks | 26/11 ముంబై ఉగ్రదాడి.. అమరులకు ప్రముఖుల నివాళులు

High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష

Indian Army microlight aircraft | రన్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్.. భారత సైన్యం అసాధారణ ఫీట్..!

Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి

Nifty 50 | నిఫ్టీ 31,700కు చేరే ఛాన్స్.. ముందున్న కీలక అడ్డంకి ఇదే..



