త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NSE | చ‌రిత్ర సృష్టించిన ఎన్ఎస్ఈ.. ప్ర‌పంచంలోనే 3వ అతిపెద్ద ఎక్స్‌ఛేంజ్‌గా రికార్డు..

NSE | భారత జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్‌ఎస్‌ఈ మరో కీలక మైలురాయిని సాధించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా అవతరించింది. ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ సుమారు రూ.5.86 లక్షల కోట్లకు చేరగా, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ విలువ రూ.5.77 లక్షల కోట్లుగా నమోదైంది.

S

Business | Published On Nov 26, 2026, 12.11 pm IST

NSE | చ‌రిత్ర సృష్టించిన ఎన్ఎస్ఈ.. ప్ర‌పంచంలోనే 3వ అతిపెద్ద ఎక్స్‌ఛేంజ్‌గా రికార్డు..
Advertisement

NSE | భారత జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్‌ఎస్‌ఈ మరో కీలక మైలురాయిని సాధించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా అవతరించింది. ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ సుమారు రూ.5.86 లక్షల కోట్లకు చేరగా, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ విలువ రూ.5.77 లక్షల కోట్లుగా నమోదైంది.

లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను వెనక్కి నెట్టి..

భారత స్టాక్ మార్కెట్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. గురువారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా నిలిచింది. ఎల్‌ఎస్‌ఈ గ్రూప్ డేటా ప్రకారం ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ సుమారు రూ.5.86 లక్షల కోట్లకు చేరుకోగా, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ విలువ రూ.5.77 లక్షల కోట్లుగా ఉంది. అలాగే జర్మనీకి చెందిన డాయిష్ బోర్స్ ఏజీ మార్కెట్ విలువ రూ.5.9 లక్షల కోట్లకు సమీపంలో ఉండగా, దానిని కూడా ఎన్‌ఎస్‌ఈ అధిగమించింది. సుమారు 63.4 బిలియన్ డాలర్ల విలువ కలిగిన డాయిష్ బోర్స్‌ను వెనక్కి నెట్టడం ఈ ఘనతలో మరో విశేషం.

మరోవైపు ఎన్‌ఎస్‌ఈ షేర్లు వరుసగా రెండో సెషన్‌లోనూ ర్యాలీ కొనసాగించాయి. నవంబర్‌లో ఇప్పటివరకు జరిగిన 18 ట్రేడింగ్ సెషన్లలో 14 సెషన్లలో షేరు ధర లాభాలను నమోదు చేసింది. ఈ పెరుగుదలతో షేరు ధర సరికొత్త గరిష్ఠ స్థాయి రూ.2,400కు చేరుకుంది. అక్టోబర్ నెలలో కొత్తగా లిస్ట్ అయిన ఈ షేరు ఏకంగా 34 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.

తొలి రెండు స్థానాల్లో ఉన్న‌వి ఇవే..

ప్రపంచంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ సంస్థల జాబితాలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈ కంటే ముందు అమెరికాకు చెందిన సీఎంఈ గ్రూప్, ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ మాత్రమే ఉన్నాయి. సుమారు రూ.10.49 లక్షల కోట్ల మార్కెట్ విలువతో సీఎంఈ గ్రూప్ మొదటి స్థానంలో ఉండగా, రూ.9.34 లక్షల కోట్ల విలువతో ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ ప్రపంచ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో మూడో స్థానాన్ని దక్కించుకోవడం భారత ఆర్థిక మార్కెట్ల ప్రాధాన్యత పెరుగుతోందనడానికి కీలక పరిణామంగా నిలిచింది.

Advertisement
Advertisement