Arvind Dharmapuri | రాష్ట్రంలో ప్రారంభమైన కాంగ్రెస్ పతనం.. ఎన్నికల నాటికి పూర్తిగా భూస్థాపితం: ఎంపీ అర్వింద్
Arvind Dharmapuri | రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీ పతనం ఇప్పటికే మొదలైందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Arvind Dharmapuri) అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా భూస్థాపితం కావడం ఖాయమని స్పష్టం చేశారు.
Arvind Dharmapuri | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీ పతనం ఇప్పటికే మొదలైందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Arvind Dharmapuri) అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా భూస్థాపితం కావడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ (BJP) అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ధీమా బాగుందన్నారు. ‘కోటి ఓట్లు - 90 సీట్లు’ అంటూ కాంగ్రెస్ ఇస్తున్న స్లోగన్ కూడా వినడానికి బాగుందంటూ ఎద్దేవా చేశారు. అయితే అదంతా కేవలం భ్రమేనని, కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ నేతలకు అసలు వాస్తవం తెలిసి వస్తుందని చెప్పారు.
కొందరు పుస్తకం (రాజ్యాంగం) పట్టుకుని తిరుగుతా ఉంటరు.. కానీ అందులో ఏముందో సదువుకోలేదంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన ఒక్కసారి కూడా దానిని తెరచి చూడలేదని ఓ కాంగ్రెస్ ఎంపీ చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు త్వరలోనే రాబోతున్నదని వెల్లడించారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల తరలింపు పాపం ముమ్మాటికీ మాజీ సీఎం కేసీఆర్‌దేనని విమర్శించారు.
సంబంధిత వార్తలు

KTR | ఉద్యోగాలు కల్పించడం అంటే ఫొటోషూట్ కాదు.. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
నవంబర్ 26, 2026

Harish Rao | రేవంత్ రెడ్డి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ మినిట్సే మరో సాక్ష్యం!
నవంబర్ 25, 2026

Revanth Reddy | తెలంగాణ క్రీడాభివృద్ధికి బలమైన పునాదిగా ఖేలో ఇండియా పోటీలు: సీఎం రేవంత్ రెడ్డి
నవంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి
- ●Nifty 50 | నిఫ్టీ 31,700కు చేరే ఛాన్స్.. ముందున్న కీలక అడ్డంకి ఇదే..
- ●26/11 Terror Attacks | 26/11 ముంబై ఉగ్రదాడి.. అమరులకు ప్రముఖుల నివాళులు
- ●TTD | 121 కిలోల బంగారు ఆభరణాలు.. తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడి భారీ విరాళం
- ●NSE | చరిత్ర సృష్టించిన ఎన్ఎస్ఈ.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎక్స్ఛేంజ్గా రికార్డు..
- ●PM Modi | వికసిత్ భారత్ నిర్మాణానికి రాజ్యాంగ విలువలే మార్గదర్శకం : ప్రధాని మోదీ

Drug-Free India Awareness March | డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు.. ప్రతి 15 రోజులకు 100 మంది వస్తున్నరు: గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.టి.ఉషరాణి

Nifty 50 | నిఫ్టీ 31,700కు చేరే ఛాన్స్.. ముందున్న కీలక అడ్డంకి ఇదే..

26/11 Terror Attacks | 26/11 ముంబై ఉగ్రదాడి.. అమరులకు ప్రముఖుల నివాళులు

TTD | 121 కిలోల బంగారు ఆభరణాలు.. తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడి భారీ విరాళం



