త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | మీకు ఎంత ధైర్యం..? ఢిల్లీ వ‌ర్సిటీ వార్నింగ్‌పై రాహుల్ గాంధీ ఫైర్‌

Rahul Gandhi | జంత‌ర్ మంత‌ర్ (Jantar Mantar) వ‌ద్ద కొన‌సాగుతున్న నిర‌స‌న‌ల్లో పాల్గొనొద్దంటూ విద్యార్థుల‌కు (Students) ఢిల్లీ యూనివ‌ర్సిటీ (Delhi University) చేసిన హెచ్చ‌రిక‌ల‌ను ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌జాస్వామ్య హ‌క్కుల‌ను అమ‌లు చేస్తున్న విద్యార్థుల‌ను బెదిరించ‌డానికి మీకు ఎంత ధైర్యం..? అని ప్ర‌శ్నించారు.

D

National | Published On Jul 24, 2026, 1.42 pm IST

Rahul Gandhi | మీకు ఎంత ధైర్యం..? ఢిల్లీ వ‌ర్సిటీ వార్నింగ్‌పై రాహుల్ గాంధీ ఫైర్‌
Advertisement

Rahul Gandhi | నీట్ పేప‌ర్ లీక్‌కు నిర‌స‌న‌గా జంత‌ర్ మంత‌ర్ (Jantar Mantar) వ‌ద్ద జ‌రుగుతున్న నిర‌స‌న‌ల‌కు దూరంగా ఉండాలంటూ విద్యార్థుల‌కు (Students) ఢిల్లీ యూనివ‌ర్సిటీ (Delhi University) కీల‌క సూచ‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ అంశంపై ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. యూనివ‌ర్సిటీ చ‌ర్య‌ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌జాస్వామ్య హ‌క్కుల‌ను అమ‌లు చేస్తున్న విద్యార్థుల‌ను బెదిరించ‌డానికి మీకు ఎంత ధైర్యం..? అని ప్ర‌శ్నించారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు దీనికి మీరే బాధ్యత వ‌హించాల్సి ఉంటుంద‌ని వ‌ర్సిటీని రాహుల్ హెచ్చ‌రించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

కాగా, నీట్ పేప‌ర్ లీక్‌, దేశ విద్యా వ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో గ‌త నాలుగు రోజులుగా ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ స‌హా దేశ వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మ విద్యార్థుల‌కు ఢిల్లీ యూనివ‌ర్సిటీ కీల‌క సూచ‌న‌లు చేసింది. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జ‌రుగుతున్న నిర‌స‌న‌ల‌కు దూరంగా ఉండాల‌ని సూచించింది. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా గురువారం కీల‌క అడ్వైజ‌రీ జారీ చేసింది.

జంతర్ మంతర్ వద్ద నిర్వహించే చట్టవిరుద్ధమైన సమావేశాలు, ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై క‌ఠిన నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని తెలిపింది. నిర‌స‌న‌ల్లో పాల్గొంటే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. ఇలాంటి కార్య‌క‌లాపాలు విద్యార్థుల వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కు తీవ్ర ముప్పు క‌లిగించ‌డ‌మే కాకుండా, భ‌విష్య‌త్తు ఉద్యోగావ‌కాశాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని తెలిపింది. అందు వ‌ల్ల‌ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జ‌రుగుతున్న నిర‌స‌న‌ల‌కు దూరంగా ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. నిర‌స‌న‌ల‌కు సంబంధించిన వీడియోల‌ను కూడా సోష‌ల్ మీడియాల్లో పోస్టు చేయొద్ద‌ని హెచ్చ‌రించింది. ఢిల్లీ వ‌ర్సిటీతోపాటూ జేఎన్‌యూ, ఐఐటీ రూర్కీ, ఐఐటీ మ‌ద్రాస్ స‌హా ప‌లు విద్యాసంస్థ‌లు త‌మ విద్యార్థుల‌కు ఇలాంటి సూచ‌న‌లే చేశాయి.

Advertisement
Advertisement