PM Modi | ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. నన్ను క్షమించండి అంటూ వీడియో రిలీజ్ చేసిన 15 ఏళ్ల బాలిక
PM Modi | నీట్ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన ఆందోళనల (CJP protests) సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ 15 ఏళ్ల బాలిక క్షమాపణలు (apology) చెప్పింది.
PM Modi | త్రినేత్ర.న్యూస్ : నీట్ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన ఆందోళనల (CJP protests) సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ 15 ఏళ్ల బాలిక క్షమాపణలు (apology) చెప్పింది. తన స్నేహితులతో కలిసి నిరసనల్లో పాల్గొన్నట్లు తెలిపింది. చుట్టుపక్కల వారి ప్రభావంతోనే తాను అలా మాట్లాడానంటూ వివరణ ఇచ్చింది.
"నా వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. నా స్నేహితులతో కలిసి నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్లా. చుట్టుపక్కల వాళ్ల ప్రభావంతోనే ప్రధానిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడాను. నేను చేసింది క్షమించరాని తప్పు. నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. నాకు చాలా సిగ్గుగా ఉంది. నాపై నాకే అసహ్యంగా ఉంది. ఇది నా జీవితంలో మొదటి, చివరి తప్పు. దేశ ప్రజలందరికీ చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి" అంటూ సదరు బాలిక పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
వాళ్లు మన పిల్లలు.. వారిని క్షమిస్తున్నా : ప్రధాని మోదీ
అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నిరసన సందర్భంగా తనను దూషించిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు చెప్పారు. వారు మన పిల్లలని.. తప్పులు చేయడం సహజమేనని పేర్కొన్నారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గంలో నడిపించడం సమాజం బాధ్యత అని పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద ఏం జరిగిందో దేశం మొత్తం చూసిందన్నారు. కొంతమంది ఆకతాయిలు అసభ్యకర పదజాలంతో దూషించారని ప్రధాని వాపోయారు. వారి మాటలు తగవని పేర్కొన్నారు. తనని, తన దివంగత తల్లిని కూడా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లంతా దారి తప్పారని.. సరైన మార్గంలో పెట్టాలన్నారు. అవమానాలు ఏ సమస్యను పరిష్కరించవని ప్రధాని చెప్పుకొచ్చారు. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ వీడియో సందేశం తర్వాత కొన్ని గంటలకే 15 ఏళ్ల బాలిక క్షమాపణ వీడియో బయటకు రావడం గమనార్హం.
Also Read..
ఏబీబీ ఇండియా భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.90.. రికార్డ్ డేట్ ఎప్పుడంటే..
11,403 పోస్టులతో ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్.. తెలంగాణలో ఖాళీలు ఎన్నంటే?
సంబంధిత వార్తలు

Mallikarjun Kharge | ప్రధాని మోదీ, అమిత్ షా, సీఎంలు అక్రమంగా ఎన్నికయ్యారు.. లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి
అక్టోబర్ 3, 2026

MLA Naveen Yadav | బీసీల లెక్కలు తేలాల్సిందే : ఎమ్మెల్యే నవీన్ యాదవ్
అక్టోబర్ 2, 2026

Captain Smit Machchhar | 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైలట్ స్మిత్‌తో ప్రధాని మోదీ
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..
- ●CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి
- ●Captain Smit Machchhar | భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను ఆస్పత్రిలో పరామర్శించి ప్రశంసించిన దుబాయ్ యువరాజు
- ●Artificial Intelligence | ఏఐతో ఆర్థిక నిపుణుల కొలువులకు ఎసరు.. స్వల్ప ఛార్జీలకే సలహాలు..
- ●Gym Trainer Arrest | యువతి అశ్లీల ఫొటో వాట్సాప్‌లో షేర్.. జిమ్ ట్రైనర్ అరెస్ట్
- ●Dulquer Salmaan | తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్ - ఒకే రోజు థియేటర్లలోకి మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు

Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..

CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి

Captain Smit Machchhar | భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను ఆస్పత్రిలో పరామర్శించి ప్రశంసించిన దుబాయ్ యువరాజు

Artificial Intelligence | ఏఐతో ఆర్థిక నిపుణుల కొలువులకు ఎసరు.. స్వల్ప ఛార్జీలకే సలహాలు..



