IBPS Clerk | 11,403 పోస్టులతో ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్.. తెలంగాణలో 191 ఖాళీలు
IBPS Clerk | బ్యాంకుల్లో ఉద్యోగమే మీ లక్ష్యమా?.. అయితే మీకోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలెక్షన్ (IBPS) మంచి అవకాశం కల్పిస్తున్నది. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ (IBPS Clerk) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IBPS Clerk | త్రినేత్ర.న్యూస్: బ్యాంకుల్లో ఉద్యోగమే మీ లక్ష్యమా?.. అయితే మీకోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలెక్షన్ (IBPS) మంచి అవకాశం కల్పిస్తున్నది. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ (IBPS Clerk) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11,403 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. శనివారం (ఆగస్టు 1) నుంచి ఈ నెల 21 వరకు అధికారిక వెబ్‌సైట్ www.ibps.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. తెలంగాణలో 191, ఆంధ్రప్రదేశ్‌లో 186 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన వారికి రూ.24,050 నుంచి రూ.64,480 వరకు ప్రతి నెల జీతం అందుతుంది.
పోస్టుపేరు- కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA)
మొత్తం పోస్టులు: 11,403
అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1731 పోస్టులు ఉన్నాయి. కర్ణాటకలో 1414, మహారాష్ట్రలో 1051, పశ్చిమబెంగాల్‌లో 946, గుజరాత్‌లో 698, తమిళనాడులో 675 చొప్పున ఉండగా, తెలంగాణలో 191, ఆంధ్రప్రదేశ్‌లో 186 ఉన్నాయి.
పరీక్ష నాటికి రాష్ట్రాల వారీగా పోస్టుల సంఖ్యలో మార్పు ఉండవచ్చు.
ఏయే బ్యాంకుల్లో అంటే..
బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, పంజాబ్ నేషన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేయాలి. స్థానిక భాషలో రాయడం, చదవడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్కులై లేదా 1998, ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
ఎంపిక విధానం
రాతపరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిసియెన్సీ టెస్ట్ ఆధారంగా. రాతపరీక్ష రెండు దశల్లో ఉంటుంది.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: ఇందులో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. 100 మార్కులకు ఉంటుంది. గంటలో పరీక్ష పూర్తిచేయాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టుకు 20 నిమిషాలు కేటాయించారు.
మెయిన్ ఎగ్జామ్: మొత్తం 200 మార్కులకు ఉంటుంది. 160 ప్రశ్నలకు అడుగుతారు.
- జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్‌నెస్- 40 ప్రశ్నలు 50 మార్కులు- 20 నిమిషాలు
- జనరల్ ఇంగ్లిష్- 40 ప్రశ్నలు 40 మార్కులు- 35 నిమిషాలు
- రీజనింగ్ ఎబిలిటీ- 40 ప్రశ్నలు 60 మార్కులు- 35 నిమిషాలు
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 40 ప్రశ్నలు 50 మార్కులు- 35 నిమిషాలు
- నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
లాంగ్వేజ్ ప్రొఫిసియెన్సీ టెస్ట్: అభ్యర్థికి తప్పనిసరిగా తాను దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి చెందిన భాషలో రాయడం, చదవడం రావాలి. పదవ తరగతి వరకు స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి. మెయిన్ ఎగ్జామ్ తర్వాత ప్రొఫిసియెన్సీ ఎగ్జామ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, డీఈఎస్ఎం అభ్యర్థులకు రూ.175
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 21
ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్‌టికెట్లు: సెప్టెంబర్‌లో
ప్రిలిమినరీ ఎగ్జామ్: అక్టోబర్‌లో
ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలు: నవంబర్‌లో
మెయిన్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు: నవంబర్‌లో
మెయిన్ ఎగ్జామ్: 2026 డిసెంబర్
ప్రొవిజనల్ అలాట్‌మెంట్: 2027 మార్చిలో
వెబ్‌సైట్: www.ibps.in
పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
సంబంధిత వార్తలు

IBPS RRB | ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్.. గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
సెప్టెంబర్ 2, 2026

Bank Jobs | బ్యాంకుల్లో కొలువుల జాతర.. 10,177 పోస్టులతో నోటిఫికేషన్లు..
జులై 5, 2026

IBPS SO Recruitment | ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. డిగ్రీ, పీజీ చేసినవారు అర్హులు
జులై 4, 2026
తాజావార్తలు
- ●Priyanka Chopra | ప్రియాంక చోప్రా తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్
- ●Akbaruddin Owaisi | నా వయసైపోయింది.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత
- ●ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!
- ●Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..
- ●CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి

Priyanka Chopra | ప్రియాంక చోప్రా తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్

Akbaruddin Owaisi | నా వయసైపోయింది.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత

ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!



