ABB India | ఏబీబీ ఇండియా భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.90.. రికార్డ్ డేట్ ఎప్పుడంటే..
ABB India | ఏబీబీ ఇండియా లిమిటెడ్ తన వాటాదారులకు శుభవార్త అందించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.90 ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేరు ముఖ విలువ రూ.2 కాగా, ఇది 4500 శాతం ప్రత్యేక డివిడెండ్‌గా కంపెనీ వెల్లడించింది.
ABB India | ఏబీబీ ఇండియా లిమిటెడ్ తన వాటాదారులకు శుభవార్త అందించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.90 ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేరు ముఖ విలువ రూ.2 కాగా, ఇది 4500 శాతం ప్రత్యేక డివిడెండ్‌గా కంపెనీ వెల్లడించింది. జూలై 31న నిర్వహించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది. మొత్తం 21,19,08,375 పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లపై ఈ ప్రత్యేక డివిడెండ్ వర్తించనుంది. డివిడెండ్ పొందేందుకు అర్హులైన వాటాదారులను గుర్తించేందుకు కంపెనీ ఆగస్టు 7ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. అర్హులైన వాటాదారులకు ఆగస్టు 29 లోపు డివిడెండ్ మొత్తాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది.
ఆశించిన స్థాయిలో ఫలితాలు..
ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే 2026 క్యాలెండర్ సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 3 శాతం పెరిగి రూ.352 కోట్ల నుంచి రూ.362 కోట్లకు చేరుకుంది. అలాగే కంపెనీ ఆదాయం 21 శాతం వృద్ధితో రూ.2,940 కోట్ల నుంచి రూ.3,559 కోట్లకు పెరిగింది. ఎబిట్డా రూ.401 కోట్ల నుంచి రూ.447 కోట్లకు చేరి 11.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే ఎబిట్డా మార్జిన్ మాత్రం గతేడాది 13.6 శాతం నుంచి 12.6 శాతానికి తగ్గి 100 బేసిస్ పాయింట్లు క్షీణించింది.
ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు..
షేర్ మార్కెట్‌లో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఏబీబీ ఇండియా షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో 0.10 శాతం తగ్గి రూ.7,284.50 వద్ద ముగిసింది. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ నిఫ్టీ సూచీ 0.27 శాతం లాభంతో ముగిసింది. ఏబీబీ ఇండియా షేరు ఈ ఏడాది ఇప్పటివరకు 40.9 శాతం రాబడిని అందించగా, గత 12 నెలల్లో 32.21 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ - అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ - కన్నడ బ్యూటీకి ఛాన్స్
- ●Supreme Court | టీఎంసీ పార్టీ గుర్తు, పేరుపై వివాదం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
- ●Stock Markets | రూ.6 లక్షల కోట్లు ఆవిరి.. స్టాక్ మార్కెట్లలో వాటర్ ఫాల్.. భారీగా అమ్మకాలు..
- ●Congress Leaders Rally | సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి
- ●Esha Singh | షూట్ఆఫ్స్లో అదరగొట్టిన ఈషా.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం..
- ●Delhi Pollution | పార్కింగ్ ఛార్జీలు రెట్టింపు, 50% సిబ్బందికి వర్క్‌ఫ్రమ్ హోమ్.. శీతాకాలానికి సిద్ధమవుతున్న ఢిల్లీ

Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ - అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ - కన్నడ బ్యూటీకి ఛాన్స్

Supreme Court | టీఎంసీ పార్టీ గుర్తు, పేరుపై వివాదం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు

Stock Markets | రూ.6 లక్షల కోట్లు ఆవిరి.. స్టాక్ మార్కెట్లలో వాటర్ ఫాల్.. భారీగా అమ్మకాలు..

Congress Leaders Rally | సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి





