Dulquer Salmaan | తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్ – ఒకే రోజు థియేటర్లలోకి మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు
మలయాళం స్టార్ మమ్ముట్టి...ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటించిన సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి రాబోతున్నాయి. మమ్ముట్టి తమిళ మూవీ ఓం... దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా ఆకాశంలో ఒక తార నవంబర్ 20న రిలీజ్ కానున్నాయి. తండ్రీకొడుకుల బాక్సాఫీస్ పోరులో ఎవరు విన్నర్‌గా నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Oct 3, 2026, 5.42 pm IST
Dulquer Salmaan | తండ్రీకొడుకులు హీరోలుగా నటించిన సినిమాలు ఒకే రోజు థియేటర్లలో రిలీజ్ కావడం అన్నది అరుదు. మలయాళ అగ్ర హీరో మమ్ముట్టితో బాక్సాఫీస్ వద్ద ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ పోటీపడబోతున్నారు. మమ్ముట్టి, ధనుష్ హీరోలుగా నటించిన తమిళ మూవీ ఓం, దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా ఆకాశంలో ఒక తార ఒకేరోజు థియేటర్లలోకి రాబోతున్నాయి.
రజనీకాంత్ జైలర్ 2...
ధనుష్, మమ్ముట్టి హీరోలుగా నటిస్తోన్న ఓం సినిమాను తొలుత దసరాకు థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ దసరా బరిలో రజనీకాంత్ జైలర్ 2 నిలవడంతో ఓం సినిమాను వాయిదాపడింది. నెల రోజులు ఆలస్యంగా నవంబర్ 20న ఈ తమిళ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఓంసినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తోన్నారు.
ఆకాశంలో ఒక తార...
కాగా నవంబర్ 20న ఓం సినిమాకు పోటీగా దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ కాబోతుంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ తెలుగు మూవీకి పవన్ సాదినేని డైరెక్టర్. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
రెండోసారి...
తండ్రి మమ్ముట్టితో తనయుడు దుల్కర్ సల్మాన్ బాక్సాఫీస్ వద్ద పోటీపడటం ఇది రెండో సారి. సావిత్రి బయోపిక్‌గా రూపొందిన మహానటిలో దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా 2018లో రిలీజైంది. మహానటితో పాటు అదే రోజు మలయాళ మూవీ పెరోల్ థియేటర్లలోకి వచ్చింది. మహానటి బ్లాక్‌బస్టర్‌గా నిలవగా... పెరోల్ డిజాస్టర్ అయ్యింది. రెండోసారి బాక్సాఫీస్ పోరులో ఎవరూ విన్నర్‌గా నిలుస్తారన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Director Shankar | తలకు బ్యాండేజ్‌తో శంకర్ – స్టార్ డైరెక్టర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన
అక్టోబర్ 3, 2026

Sreeleela | సూపర్ స్టార్ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ – ధర్మన్‌లో ధమాకా బ్యూటీ
అక్టోబర్ 3, 2026

Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ – తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత
- ●ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!
- ●Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..
- ●CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి
- ●Captain Smit Machchhar | భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను ఆస్పత్రిలో పరామర్శించి ప్రశంసించిన దుబాయ్ యువరాజు
- ●Artificial Intelligence | ఏఐతో ఆర్థిక నిపుణుల కొలువులకు ఎసరు.. స్వల్ప ఛార్జీలకే సలహాలు..

Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత

ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!

Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..

CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి



