Road Accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
Road Accident | మహారాష్ట్ర (Maharashtra)లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు తొమ్మిది మంది గాయపడ్డారు.
Road Accident | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. శుక్రవారం ఉదయం నాందేడ్ (Nanded), భండారా (Bhandara) జిల్లాల్లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు (14 dead). అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
నాందేడ్-భోకర్ రహదారిపై ఉన్న సీతాఖండి ఘాట్ వద్ద టాటా మ్యాజిక్-ట్రక్కు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని భోకర్, నాందేడ్‌లోని ఆసుపత్రులకు తరలించారు. భండారా జిల్లాలోని లాఖనీ తాలూకా పరిధిలో నాగ్‌పూర్-రాయ్‌పూర్ జాతీయ రహదారిపై పింపల్‌గావ్ సమీపంలో కూలీలతో వెళ్తున్న పికప్ వాహనం ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. రెండు ప్రమాదాల్లో మొత్తం 14 మంది మరణించగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల డెడ్‌బాడీస్‌ను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Also Read..
తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ
అసెంబ్లీ వద్ద చాలా అవమానం జరిగింది.. ఎన్‌హెచ్ఆర్సీకి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదు
మెజారిటీ కోసం కుట్ర.. పార్లమెంటు వాయిదా ఆలస్యంపై జైరామ్ రమేష్ మండిపాటు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●BRS Complaint to NHRC | అసెంబ్లీ వద్ద చాలా అవమానం జరిగింది.. ఎన్‌హెచ్ఆర్సీకి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదు
- ●Samsung Galaxy S26 | తక్కువ ధరలకే గెలాక్సీ ఎస్26 ఫోన్లు.. శాంసంగ్ రీన్యూడ్ ప్రోగ్రామ్‌లో ఆఫర్..
- ●Jairam Ramesh | మెజారిటీ కోసం కుట్ర.. పార్లమెంటు వాయిదా ఆలస్యంపై జైరామ్ రమేష్ మండిపాటు
- ●Crude Oil Prices | వంద డాలర్లు దాటిన క్రూడ్!
- ●Charan Koushik Yadav | కేటీఆర్ ఎన్ని కుట్రలు చేసినా పెట్టుబడుల ప్రవాహం ఆగదు
- ●Mahesh Goud | పాపం పండి ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

BRS Complaint to NHRC | అసెంబ్లీ వద్ద చాలా అవమానం జరిగింది.. ఎన్‌హెచ్ఆర్సీకి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదు

Samsung Galaxy S26 | తక్కువ ధరలకే గెలాక్సీ ఎస్26 ఫోన్లు.. శాంసంగ్ రీన్యూడ్ ప్రోగ్రామ్‌లో ఆఫర్..

Jairam Ramesh | మెజారిటీ కోసం కుట్ర.. పార్లమెంటు వాయిదా ఆలస్యంపై జైరామ్ రమేష్ మండిపాటు

Crude Oil Prices | వంద డాలర్లు దాటిన క్రూడ్!






