TG Govt | కరువు వేళ రైతులకు ప్రభుత్వం భరోసా
TG Govt | ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఖరీఫ్ పంట రుణాల రీషెడ్యూలింగ్, ఆరుతడి పంటల సాగుకు ప్రోత్సాహం, సబ్సిడీల అందజేతపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు వాతావరణ పరిస్థితులపై అవగాహన కల్పించడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
- ఖరీఫ్ రుణాల రీషెడ్యూలింగ్‌కు అవకాశం..
- డిసెంబర్ 7లోగా ప్రక్రియ పూర్తి చేయాలి
- ఆరుతడి పంటలకు సబ్సిడీ..
- రైతు నేస్తంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన
TG Govt | ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఖరీఫ్ పంట రుణాల రీషెడ్యూలింగ్, ఆరుతడి పంటల సాగుకు ప్రోత్సాహం, సబ్సిడీల అందజేతపై ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు వాతావరణ పరిస్థితులపై అవగాహన కల్పించడంతో పాటు పెట్టుబడి ఖర్చులు తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ 114వ ఎపిసోడ్‌లో ఎల్‌నినో ప్రభావం, కరవు పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల వైవిధ్యీకరణ, రుణాల రీషెడ్యూలింగ్‌పై అధికారులు, శాస్త్రవేత్తలు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 1,600 రైతు వేదికల్లో రైతులు వీక్షించారు. వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ సంచాలకుడు బీ గోపి పాల్గొన్నారు.
రుణాల చెల్లింపులకు ఏడాది వెసులుబాటు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 365 కరవు మండలాల్లో 254 మండలాల్లో మధ్యస్థ, 111 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య తీసుకున్న ఖరీఫ్ పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)ని ప్రభుత్వం కోరింది. అర్హులైన రైతులు అసలు, వడ్డీ చెల్లింపులను ఏడాది పాటు వాయిదా వేసుకునే అవకాశం ఉంటుందని బ్యాంకు అధికారులు వెల్లడించారు. రీషెడ్యూలింగ్‌తో సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ఇందుకోసం రైతులు సంబంధిత బ్యాంకుల్లో సమ్మతి పత్రాలు అందజేయాలని సూచించారు. అర్హులైన రైతుల వివరాలను గ్రామాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఖరీఫ్ రుణాల రీషెడ్యూలింగ్ ప్రక్రియను డిసెంబర్ 7లోగా పూర్తి చేయించాలని వ్యవసాయ శాఖ సంచాలకుడు బి. గోపి అధికారులను ఆదేశించారు.
వరి సాగుకు దూరంగా ఉండాలి..
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, రాత్రి ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకునే మార్పులను భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి వివరించారు. బోరుబావుల్లో భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలని, కూరగాయలు, ఆరుతడి పంటలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. కొత్త బోర్లు వేయకుండా, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని వచ్చే వేసవి చివరి వరకు తాగునీటి అవసరాలకే వినియోగించాలని నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు.
ఆరుతడి పంటలకు ప్రోత్సాహం
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక సర్వేలో ఐదు లక్షల ఎకరాల్లో పంటల వైవిధ్యీకరణకు ప్రతిపాదనలు వచ్చినట్లు సురేంద్రమోహన్ తెలిపారు. ఆరుతడి పంటల సాగు కోసం విత్తన సబ్సిడీ, డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలపై రాయితీలు, సోలార్ ఫెన్సింగ్, వ్యవసాయ కుంటల ఏర్పాటుకు రైతులు విజ్ఞప్తులు చేశారని వెల్లడించారు. వీటిపై సమగ్ర ప్రణాళిక రూపొందించి రాయితీలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎల్‌నినో కారణంగా రైతులపై పడే పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు సిద్ధంగా ఉంచిందని, అవసరమైతే కేంద్రం కూడా సహకరించేందుకు సుముఖంగా ఉందని పేర్కొన్నారు. విజయవంతంగా పంటలు సాగు చేస్తున్న రైతుల అనుభవాలను ఇతరులకు చేరవేసేందుకు ‘రైతు నుంచి రైతుకు’ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
రైతుల సమస్యలపై తక్షణ స్పందన
మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, హనుమకొండ, నిర్మల్, కరీంనగర్ జిల్లాల రైతులతో సురేంద్రమోహన్ నేరుగా మాట్లాడారు. సాగులో ఎదురవుతున్న సమస్యలు, సబ్సిడీలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థాయిలో నిర్ణయించాల్సిన అంశాలపై సోమవారంలోగా నివేదికలు పంపాలని ఆదేశించారు. కూరగాయల సాగు చేస్తున్న రైతులు తమ ఉత్పత్తుల విక్రయానికి రైతు బజార్లు ఏర్పాటు చేయాలని కోరగా, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, సహకార శాఖలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. ఇప్పటికే ఉన్న రైతు బజార్లను వినియోగించుకోవడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్తవి ఏర్పాటు చేసే అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
పంట వ్యర్థాలను కాల్చొద్దు
పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు, వాటిని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వినియోగించుకునే విధానాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఎల్‌నినో పరిస్థితులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ ఆవశ్యకతను వివరించారు. వరికి బదులుగా పెసర సాగు చేసి మంచి దిగుబడులు, లాభాలు సాధించిన మహబూబాబాద్ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతులు సాంబయ్య, జీ సంజీవ్ కూడా పంటల వైవిధ్యీకరణలో తమ విజయాలను వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేపట్టాలని, శాస్త్రవేత్తల సలహాలు పాటించి పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Devi Prasad | ఉద్యమ పోరాటం, ఆరాటాన్ని ప్రజలకు చెప్పాల్సి ఉంది.. పార్టీలకతీతంగా దీక్షా దివస్‌కు రండి
- ●Vishwak Sen | యంగ్ పొలిటికల్ లీడర్‌గా విశ్వక్సేన్ - రాజకీయ వారసుల కష్టాలపై సినిమా
- ●Karthigai Deepam lamp | తిరుప్పరంకుండ్రం కొండపై 100 ఏళ్ల తర్వాత వెలిగిన కార్తీక దీపం.. భక్తులు భావోద్వేగం
- ●Royal Enfield Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేసింది.. ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయి..?
- ●Tirupparankundram | తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం.. 164 ఏళ్ల చరిత్రలో కీలక మలుపు..!
- ●Pakistan-occupied Kashmir | పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ నియోజకవర్గాల పునర్విభజన..

Devi Prasad | ఉద్యమ పోరాటం, ఆరాటాన్ని ప్రజలకు చెప్పాల్సి ఉంది.. పార్టీలకతీతంగా దీక్షా దివస్‌కు రండి

Vishwak Sen | యంగ్ పొలిటికల్ లీడర్‌గా విశ్వక్సేన్ - రాజకీయ వారసుల కష్టాలపై సినిమా

Karthigai Deepam lamp | తిరుప్పరంకుండ్రం కొండపై 100 ఏళ్ల తర్వాత వెలిగిన కార్తీక దీపం.. భక్తులు భావోద్వేగం

Royal Enfield Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేసింది.. ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయి..?





