త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణ‌లో మూడురోజులు భారీ వ‌ర్షాలు.. హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ‌శాఖ‌

TG Weather | తెలంగాణ‌లో రాగ‌ల మూడురోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ ప్రాంతీయ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ముఖ్యంగా ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని తెలిపింది.

P

Telangana | Published On Sep 11, 2026, 1.42 pm IST

TG Weather | తెలంగాణ‌లో మూడురోజులు భారీ వ‌ర్షాలు.. హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ‌శాఖ‌
Advertisement

TG Weather | తెలంగాణ‌లో రాగ‌ల మూడురోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ ప్రాంతీయ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ముఖ్యంగా ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని తెలిపింది. శుక్ర‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, న‌ల్గొండ‌, ఖ‌మ్మం, సూర్యాపేట, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని తెలిపింది. అలాగే, నిర్మ‌ల్, నిజామాబాద్‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, సూర్యాపేట‌, రంగారెడ్డి, భువ‌న‌గిరి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపులు, గంట‌కు 30-40 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తూ వాన‌లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.

శ‌నివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, విక‌రాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వాన‌లు ప‌డుతాయ‌ని చెప్పింది. ఆదివారం ఆదిలాబాద్‌, మంచిర్యాల‌, ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ వివ‌రించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Read Also :

వంద డాలర్లు దాటిన క్రూడ్‌,,! వారంలోనే 12 శాతం పైగా పెరిగిన బ్రెంట్‌

పాపం పండి ఫాంహౌస్‌కు ప‌రిమిత‌మైన కేసీఆర్‌: పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్‌

Advertisement
Advertisement